నిజానికి మించి కనిపిస్తోంది

news02 Feb. 22, 2019, 7:49 a.m. entertainment

varma

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా ఎన్టీఆర్. ఇప్పటికే మొదటి భాగం ఎన్టీఆర్ కధానాయకుడు విడుదలైంది. ఇక ఇప్పుడు రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు వచ్చేస్తోంది. జనవరి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదేసమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి మొదటి వారంలో విడుదలవుతోంది. దీంతో ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులతో పాటు.. రాజకీయ వర్గాల్లోను ఆసక్తి నెలకొంది.

rana

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో నిజాలను నిర్భయంగా చూపించబోతున్నానంటూ వర్మ చెప్పడం మరింత ఆసక్తి రేపుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే.. చంద్రబాబు పాత్రలో రానా కనిపిస్తున్నమహానాయకుడు షూటింగ్ స్టిల్‌పై వర్మ తనదైన స్టైల్లో స్పందించారు. సోషల్ మీడియాలో ఈ స్టిల్ షేర్ చేసిన రాంగోపాల్ వర్మ.. చంపేశావ్ రానా.. నిజానికి మించి నీ రూపు కనిపిస్తోంది అని కామెంట్ చేశాడు. దీంతో వర్మ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

tags: varma, ramgopal varma, varma about rana, ramgopal varma about rana, varma about ran charector in ntr movie, varma appreciate rana

Related Post