సినిమా రూప‌క‌ల్ప‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న రాజ‌మౌళి

news02 June 27, 2018, 2:04 p.m. entertainment

maghadeera
హైద‌రాబాద్‌:తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో మ‌గ‌ధీర ఎలాంటీ సంచ‌నాలు సృష్టించిందో తెలిసిందే క‌దా. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రాంచ‌ర‌ణ్‌,కాజ‌ల్ కాంబినేష‌న్లో వ‌చ్చిన ఈమూవీ వెండితెర‌పై అద్భుతాలే క్రియేట్ చేసింది. చాలా సినిమాల‌ రికార్డుల‌ను ఈమూవీ బ్రేక్ చేసింది. అయితే ఇంత అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈసినిమాను మ‌రోమారు విడుద‌ల చేసేందేందుకు రాజ‌మౌళి సిద్ధ‌మ‌వుతున్నాడంటా..!

rajamouli

అయితే మ‌గ‌ధీర విడుద‌ల కాబోయేది భార‌తీయ భాష‌ల్లో మాత్రం కాదంటా..! జ‌ప‌నీస్ భాష‌లో ఈమూవీని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటా..! బాహుబ‌లి-2కు ఇప్ప‌టికే జ‌పాన్‌లో మంచి ఆద‌ర‌ణ వ‌చ్చినందునా...ఆయ‌న ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌రంటా..! బాహుబ‌లి కంక్లూజ‌న్ లాగే స‌బ్‌టైటిల్స్‌తో మ‌గ‌ధీర‌ను జ‌పాన్‌లో విడుద‌ల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడంటా...! ఇందుకోసం ఇప్ప‌టికే నిర్మాత శోభూ యార్లగడ్డతో క‌లిసి జపాన్‌ వెళ్లి వ‌చ్చిన ద‌ర్శ‌క రారాజు రాజ‌మౌళి మూవీ విడుద‌ల‌పై ఓనిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. 

maghadeera

ఈవిష‌యాన్ని త్వ‌ర‌లోనే రాజ‌మౌళి అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. సో అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే...జ‌ప‌నీస్ ప్రేక్ష‌కుల‌ను మ‌గ‌ధీర కొద్ది నెల‌ల్లోనే అల‌రించ‌నుంది. 

tags: magadeera movie release

Related Post