దర్శకేంద్రుడికే చెబుతోంది

news02 March 3, 2019, 4:42 p.m. entertainment

meharin

అందాల భామ మెహరీన్‌ తెలుసు కదా.. తన అందచందాలతో మత్తెక్కించేస్తుందీ సుందరి. ఐతే అసలు ఏమైందంటే.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు మెహరీన్ టీచర్‌గా మారిపోయింది. అయ్యే అంతపెద్ద దర్శకుడికి మెహరీన్‌ టీచర్ గా మారి పాఠాలు చెప్పడమేంటని అశ్చర్యపోతున్నారా..  అసలు విషయం ఏంటంటే.. హీరో వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘f2’ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుని.. విజయవంతంగా పరిగెడుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లో అర్థశత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిగో ఈ సందర్బంగానే అందాల భామ మెహరీన్‌, రాఘవేంద్రరావు మధ్య ఓ ఆసక్తిరకమైన సన్నివేశం చోటుచేసుకుంది. సినిమాలోని హనీ ఈజ్‌ ద బెస్ట్ అంటూ తన ఫన్నీ మేనరిజంతో అందరిని ఆకట్టుకుందికదా..  ఈ మేనరిజాన్ని మెహరీన్‌.. రాఘవేంద్రరావుకు నేర్పించే ప్రయత్నం చేసిందట. రాఘవేంద్ర రావు బాగా నేర్చుకున్నారో లేదో గానీ మెహరీన్‌ ఆయనకు నేర్పిస్తున్నప్పుడు తీసిన ఫొటోలు మాత్రం బాగా పాపులర్ అయ్యాయి. అదన్న మాట సంగతి,

tags: meharinn, actress meharin, meharin hot, meharin with raghavendra rao, meharin about raghavendra rao, meharin talking with raghavendra rao

Related Post