ప్రేమ పెళ్లి కం పెద్దల వివాహం

news03 March 25, 2019, 8:31 a.m. entertainment

venkatesh

చాలా కాలం తరువాత దగ్గుబాటి వారి ఇంట బాజా బజంత్రీలు మోగాయి. హీరో విక్టరీ వెంకటేష్‌ పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లి వేడుక ఈ తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌ రాజధాని జయపురలోని ఓ హోటల్‌లో ఆశ్రిత - వినాయక్‌ రెడ్డి పెళ్లి నయానందకరంగా జరిగింది. అవడానికి ఇది ప్రేమ పెళ్లే అయినా.. పెద్దలు కుదిర్చిన పెళ్లిగా మారింది. అదేనండీ వెంకటేష్ కూతురు అశ్రిత, వినాయక్ రెడ్డిలు ప్రేమించుకుంటే.. వారి ప్రేమను పెద్దలు అంగీకరించి.. పెళ్లి జరిపించారన్న మాట. వరుడు వినాయక్‌ రెడ్డి  హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడన్న మాట. 

venkatesh

ఇక రాజస్థాన్ లోని జయపురలో గత నాలుగు రోజులుగా పెళ్లి వేడుకుల్లో మునిగితేలారు ఇరువురి కుటుంబ సభ్యులు. పెళ్లి ముందస్తు వేడుకల్లో భాగంగా సంగీత్‌ కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. వివాహానికి పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటని ఆశీర్వదించారు. ఇక హీరో వెంకటేష్‌కి మంచి స్నేహితుడైన బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌తో పాటు ఇతర పరిశ్రమలకి చెందిన పలువురు అతిథులు పెళ్లికి వచ్చి శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రామ్‌చరణ్‌ - ఉపాసన, నాగచైతన్య - సమంతలు పెళ్లిలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇక హైదరాబాద్ లోను వివాహ విందును ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు హీరో వెంకటేష్.

venkatesh

tags: venkatesh, hero venkatesh, vekatesh daughter marriage, venkatesh daughter ashrita marriage, daggubati ashrita daughter marriage, hero venkatesh daughter ashritha marriage, daggubati ashritha wedding ceremony

Related Post