నాగార్జునకు ఇప్పుడు పెళ్లేంటీ

news02 June 14, 2019, 8:08 p.m. entertainment

manmadhadu-2

బెండకాయ ముదిరినా.. బ్రహ్మచారి ముదిరినా తరువాత ఎందుకు పనికిరావని అంటుంటారు. అంతే కాదు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే  జరగాలంటారు పెద్దలు. ఈ డైలాగ్ ఖచ్చితంగా పెళ్లి విషయంలోనే ఎక్కువగా  వాడుతుంటారు. అయితే అక్కినేని నాగార్జునకు మాత్రం పాపం వయసంతా అయిపోయాక జ్ఞానోదయమైంది. పెళ్ళీడు వయసులో ఉన్నప్పుడు పెళ్లంటే తెగ చిరాకు పడ్డాడు. వయసు కాస్త కరిగిపోయాక... నేను పెళ్లి చేసుకుంటానంటూ అమ్మాయిల వెంట పడ్డాడు. ఇంకేముందు పిల్లలకు పెళ్లిళ్లు చేసే వయసులో ఇప్పుడు పెళ్లేంటని ఇంట్లోవాళ్లు కంగారు పడ్డారు. మరి ఇంతకీ నాగార్జునకు పెళ్లయ్యిందా.. పెళ్లి కోసం ఆయన ఎలా తంటాలు పడ్డాడో తెలియాలంటే మాత్రం మన్మథుడు 2 సినిమా చూడాల్సిందే. అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమానే మన్మధుడు-2. అందాల భామలు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కీర్తీ సురేష్ లు ఈ సినిమాలో నటిస్తున్నారు. 

manmadhadu-2

tags: manmadhadu-2, nagarjuna manmadhadu-2, nag manmadhadu-2, manmadhadu-2 movie, manmadhadu-2 shooting, manmadhadu-2 news, manmadhadu-2 latest news,

Related Post