విశ్వాసం మూవీ రివ్యూ

news02 March 2, 2019, 7:43 a.m. entertainment

vishwasam

సినిమా- విశ్వాసం

తారాగణం- అజిత్ కుమార్, నయనతార, జగపతిబాబు, అనిక తదితరులు

మ్యూజిక్- డి.ఇమ్మాన్‌

నిర్మాత- టీజీ త్యాగరాజన్‌, సెంథిల్ త్యాగరాజన్

దర్శకత్వం- శివ

పరిచయం.............

హీరో అజిత్‌ కు ఒకక్ తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడంలోను మంచి గుర్తింపు ఉంది. అజిత్ కు దక్షిణాది బాషల్లో చాలా మంది అభిమానులున్నారు. అప్పుడప్పుడూ నేరుగా తెలుగులోను అజిత్ సినిమాలు చేశారు కూడా. డైరెక్టర్ శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన సినిమా విశ్వాసం. అంతకు ముందు అజిత్-శివ కాంబినేషన్‌లో వచ్చిన వీరమ్‌, వేదాళం, వివేగం సినిమాలు సక్సెస్ అయ్యాయి. అందుకే ఇప్పుడు విశ్వాసం సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తమిళంలో ఈ సంక్రాంతి పండుగకు విడుదలైన విశ్వాసం ప్రేక్షకాధరణ పొందింది. ఇదిగో ఇప్పుడు అదే పేరుతో తెలుగులో విడుదలైన విశ్వాసం సినిమా ఎలా ఉందో చూసేద్దామా.. 

vishwasam

విశ్వాసం కధ...

వీర్రాజు (అజిత్)ను రావులపాలెం దాని చుట్టు పక్కల గ్రామాల ప్రజలంతా ఎంతో గౌరవిస్తారు. అని వార్య కారణాలతో ఆగిపోయి, సుమారు పదేళ్ల తర్వాత ఆ ఊరిలో జాతర చేయడానికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఈ క్రమంలో వీర్రాజును వ్యతిరేకించే కొంతమంది ఈ జాతరను నిర్వహించడానికి ఏ మాత్రం ఒప్పుకోరు. అయినప్పటికీ వీర్రాజు ఎంతో పట్టుదలతో జాతర చేయిస్తాడు. ఆ ఉరి జనాలంతా ఆ జాతరలో తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతుంటుంటే.. వీర్రాజు మాత్రం తన భార్య నిరంజన (నయనతార) తన దగ్గర లేదని ఆవేధన చెందుతుంటాడు. దీంతో అతని బంధువులు వీర్రాజుకు చెప్పకుండా.. ముంబయిలో ఉన్న భార్య నిరంజన, కూతురు శ్వేతలను ఊరికి రప్పిస్తారు. ఈ క్రమంలో వీర్రాజు కూతురిని గుర్తు తెలియని వ్యక్తులు చంపే ప్రయత్నిస్తారు. ఇంతకీ వీర్రాజు కూతురును చంపాలనుకుంది ఎవరు.. వారిని వీర్రాజు ఎదిరించాడా.. అసలు వీర్రాజు భార్య నిరంజన ఎందుకు ముంబయిలో ఉంటుది.. అన్నదే అసలు కధ.

ఎలా ఉందో తెలుసా........

నిజం చెప్పాలంటే విశ్వాసం సినిమాలో కధ పెద్దగా ఏంలేదని చెప్పవచ్చు. చాలా సినిమాల్లో ఉండే రొటీన్ కధే. శత్రువల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం హీరో ఏం చేశాడన్నదే ఈ సినిమాలోని కధ. ఈ చిన్న అంశం చుట్టూ సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లాడు దర్శకుడు. ఐతే వాటిని కధకు అతికినట్టు కాకుండా.. కేవలం అజిత్‌ అభిమానులను దృష్టిలో పెట్టుకుని మాత్రమే సన్నివేశాలను రాసుకున్నట్లు అనిపించింది. సినిమా ప్రారంభం నుంచి శుభం కార్డు వరకూ కథ అంతా అజిత్‌ చుట్టూ మాత్రమే తిరుగుతుందు. అజిత్‌ హీరోయిజాన్ని హైలెట్ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటాయి. సాధారనంగానే హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్, తండ్రి కూతుళ్ల మధ్య వచ్చే కొన్ని మంచి ఎమోషనల్ సన్నివేశాలు ఉద్వేగానికి లోనుచేస్తాయి. 

vishwasam

అంతా ఇలా చేశారు........

రొటీన్ గానే హీరో అజిత్‌ తనదైన నటతో ఆకట్టుకున్నాడు. ఇలాంటి పాత్రలు చేయడం అజిత్ కు వెన్నతో పెట్టిన విధ్య అని చెప్పవచ్చు. చుట్టు పక్కల పల్లెలకు పెద్ద మనిషిగా, తన కుటుంబాన్ని రక్షించుకునే వ్యక్తిగా అజిత్‌ నటన అలరించింది. ఇక ఈ సినిమాకు బలం అందాల భామ నయనతార. ఆ పాత్రలోనయన్ ఒదిగిపోయింది. ప్రధానంగా ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నయనతార నటన సూపర్ అని చెప్పవచ్చు. ఇక విలన్ గా సీనియర్ నటుడు జగపతిబాబు తన సహజ ధోరణిలో నటించి ఆకట్టుకున్నాడు. కాస్త జగపతి బాబు పాత్ర నిడివిని పెంచితే కధకు ఇంకాస్త బలం వచ్చేదని అనిపించింది. మొత్తానికి ఎదో టైం పాస్ కోసం సినిమా చూడాలి తప్ప.. అజిత్ రేంజ్ లో మాత్రం సినిమా లేదని చెప్పకతప్పడం లేదు.

గమనిక- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

tags: vishwasam, visahwasam movie, vishwasam film, vishwasam telugu movie, vishwasam review, vishwasam movie review, vishwasam film review, vishwasam movie rating, vishwasam movie exclusive review

Related Post