News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మాజీ CLP నేత జానారెడ్డి మిర్చీ ముచ్చట్లు…

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.. ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులలో రాజకీయ ధురందరుడిగా పేరుగాంచిన వ్యక్తి.. ‘కుందూరు జానారెడ్డి’. దాదాపు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి.. ఎన్టీఆర్ నుంచి మొన్నటి చివరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరకు ఆయా ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సమీప టిఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో పరాజయం చెందాడు.

అప్పటి నుంచి రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ.. ఆయన వ్యక్తిగత పనులు చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో.. అడపాదడపా కార్యకర్తల కోరిక మేరకు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఉన్నారు. అయితే.. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తిరుమలగిరి-సాగర్ మండల కేంద్రంలో పర్యటించారు సీనియర్ నేత జానారెడ్డి. కాసేపు కారు దిగి.. సామాన్య ప్రజానికాన్ని కుశల ప్రశ్నలు వేస్తూ.. చివరికి రోడ్డు వెంబడి మిర్చి బండి దగ్గరికి వెళ్ళాడు.

- Advertisement -

రెండు మిర్చీలు తిన్న తర్వాత.. పచ్చి మిర్చీని కట్ చేసి.. మధ్యలో కాస్త మసాల, కారంపొడి కలిపి నూనెలో వేయిస్తే.. ఆ మజాయే వేరంటూ చెప్పుకొచ్చారు. అలా చేస్తే నీ వ్యాపారమూ పెరుగుతుందని మిర్చీ బండి నడిపే వ్యక్తికి సూచించారు జానారెడ్డి. మామూలుగానే కుందూరు జానారెడ్డి గారికీ.. భోజన ప్రియుడు అనే బిరుదు ఉంది. అంత పెద్ద నాయకుడు వచ్చి.. తన మిర్చీ బండి దగ్గర ఆగి..రెండు మిర్చీలు తినడంతో సదరు వ్యక్తి ఆనందపడ్డాడు.

Tags: ex clp leader, janaareddy, mirchi muchatlu, nagarjunasagar

Leave A Reply

Your email address will not be published.