అంబానీ ఇంట్లో పెళ్లికి బియాన్సే..

news02 Oct. 23, 2018, 9:11 p.m. general

Isha

రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌, నీతా అంబానీ దంపతుల కుమార్తె ఈషా అంబానీ త్వరలో ఓ ఇంటివారు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపార వేత్త పిరామల్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ అజయ్‌ పిరామల్‌ కుమారుడు ఆనంద్‌ను ఈషా పెళ్లి చేసుకోబోతున్నారు. డిసెంబర్‌లో వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం. అయితే వీరి సంగీత్‌ వేడుకలో అంతర్జాతీయ పాప్‌ స్టార్‌ బియాన్సే ప్రదర్శన ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకోసం ముఖేష్ అంబానీ పాప్ సింగర్ బియాన్సేకు దాదాపు 15 కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

Isha ambani

సాధారనంగా ప్రైవేట్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బియాన్సే 2 మిలియన్‌ డాలర్లు పారితోషికంగా తీసుకుంటుంది. ఇటీవల ఇటలీలోని లేక్‌ కోమోలో ఆనంద్‌-ఇషా నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది. ఐతే ఇలా అంతర్జాతీయ పాప్ సింగర్ బియాన్సే తో పాటలు పాడించడం మాత్రం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇంతకు ముందు తమ ఇంట్లో జరిగే కార్యక్రమాలకుప బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్ లాంటి వారితో డ్యాన్స్ లు చేయించిన అంబానీకి.. ఇంటర్నేషనల్ పాప్ స్టార్స్ తో పాటలు పాడించడం ఓ లెక్కా అన్న కామెంట్స్ విన్పిస్తున్నాయి.

tags: Ambani, isha ambani, isha ambani marriage, biyaance singing in isha ambani marriage, pop singer biyaance will sing in isha ambani marriage

Related Post