News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సాంప్రదాయ వస్త్రాలలో స్వామివారి దర్శనం చేసుకున్న పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది సేపటి కిందట తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఎన్నో వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సాంప్రదాయ దుస్తులలో స్వామివారిని దర్శించుకోవడం చూపరులను ఆకట్టుకుంది. అడ్డపంచె, కండువా, నుదుట సింధూరంతో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.

చిన్నతనంలో తాను ఏడుకొండల వాడిని దర్శించుకున్నప్పుడు తిరుమల గిరులలో ప్రతిధ్వనించే ధర్మో రక్షతి రక్షిత: అని నేర్చుకున్నానని ఆయన తెలిపారు. అదే ధర్మాన్ని తాను త్రికరణ శుద్ధిగా పాటిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

- Advertisement -

ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందనే ఆరోక్తికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ తో బాటు జన సేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ తదితరులు ఉన్నారు.

Tags: Janasena, Pawan Kalyan, Visits Tirumala, Temple, ttd temple

Leave A Reply

Your email address will not be published.