News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

హుజూర్ నగర్ లో కాంగ్రెస్ దే గెలుపు ..!

హైదరాబాద్ : హుజూర్‌ నగర్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉత్తమ్‌ పద్మావతే తమ అభ్యర్థి అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆమెను నిలబెట్టి గెలిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అక్కడ ఎవరిని నిలబెట్టాలో తమ జిల్లా నాయకులకు తెలుసన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.

Venkatreddy

హుజూర్‌ నగర్​ లో ఎవరిని నిలబెట్టాలో తమకు తెలియదా అని ప్రశ్నించిన వెంకట్ రెడ్డి .. తమ జిల్లా విషయంలో పక్క జిల్లా నాయకుల సలహాలు అవసరం లేదని చెప్పారు. ఈ మధ్య కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి సలహాలు తమకు అవసరం లేదన్నారు. రేవంత్‌రెడ్డి చెప్పే అభ్యర్థి పేరు తనకే కాదు .. జానారెడ్డికి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచేది తామేనన్న ఆయన … జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌ రెడ్డి తానూ ఒక్కటయ్యామన్నారు. జానారెడ్డి, ఉత్తమ్​కుమార్​ రెడ్డితో తనకెలాంటి అభిప్రాయ భేదాలు లేవని స్పష్టం చేశారు.

- Advertisement -

Komatireddy venkatreddy

Tags: KOMATIREDDY VENKAT REDDY, KOMATIREDDY RAJAGOPAL REDDY, UTTAM KUMAR REDDY, JANAREDDY, HIZURNAGAR BYPOLL,UTTAM PADMAVATHI,KODADA EX MLA PADMAVATHI, REVANTH REDDY, ASSEMBLY, CONGRESS,BJP,TRS,KCR,KTR, HARISHRAO, GANDHIBHAVAN,TRS BHAVAN, TELANGANA GOVERNMENT

Leave A Reply

Your email address will not be published.