News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కృషుడి వేషధారణలో అల‌రించిన చిన్నారులు ..!

హైద‌రాబాద్ : జగన్నాటక సూత్రధారి శ్రీకృ‌ష్ణుడి జన్మదిన వేడుకలు దేశ‌వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జ‌రిగాయి. శ్రీకృ‌ష్ణుడి ఆలయాలు పండుగ శోభతో అలరారాయి. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఇస్కాన్‌ ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు వచ్చి శ్రీకృ‌ష్ణుడికి పూజలు చేశారు. కృషుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చక్కని అలంకరణలతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృషుడి వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు.

krishnastami

- Advertisement -

ఇస్కాన్ దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయ‌డంతో పాటు ఉట్టికొట్టే కార్య‌క్ర‌మాల‌ను భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో నిర్వ‌హించారు.  వివిధ రకాల పుష్పాలతో శ్రీకృష్ణుడ్ని అలంకరించారు భ‌క్తులు. దేశవ్యాప్తంగా ఇస్కాన్ ఆలయాల్లో ఏటా ఘనంగా శ్రీ కృష్ణాష్టమి  వేడుకులను నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే.  ప్రస్తుత జీవన విధానంలో శ్రీ కృష్ణతత్వం ద్వారా ప్రశాంతత లభిస్తుందని భ‌క్తుల విశ్వాసం . శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం తమకెంతో ఆనందంగా ఉందని భక్తులు చెబుతున్నారు.

krishnastami

Leave A Reply

Your email address will not be published.