News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఏపీ సీఎస్‌గా నీలమ్ సహానీ?

ఏపీలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీతో ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. సుబ్రహ్మణ్యం తరువాత సీనియారిటీ లిస్టులోఉన్న ఒకరిద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా సీనియర్ ఐఏఎస్‌లు నీలం సహానీ, సమీర్ శర్మల పేర్లు వినిపిస్తున్నాయి. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ కావడానికి కొన్ని గంటల ముందు నీలం సహానీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయినట్లు అమరావతి రాజకీయ, ఐఏఎస్ వర్గాల్లో వినిపిస్తోంది.

1983 బ్యాచ్ కు చెందిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేసిఆయన్ను నియమించింది.

ఇప్పుడు నీలం సహానీ రేసులో ముందున్నట్లు వినిపిస్తోంది. అయితే, సీనియారిటీ ప్రకారం ఆమె కంటే ముందు ప్రీతి సుడాన్, అనిల్ చంద్ర పునేఠా ఉన్నారు. ప్రస్తుతం సీనియారిటీ ప్రకారం ఏపీ ఐఏఎస్ అధికారుల్లో ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రీతి సుడాన్‌లు అందరికంటే సీనియర్లు. వీరిద్దరూ 1983 బ్యాచ్ అధికారులు. ఆ తరువాత 1984 బ్యాచ్‌కు చెందిన అనిల్ చంద్ర పునేఠా, నీలమ్ సహానీ, ఏపీ సహానీ ఉన్నారు.

- Advertisement -

ఇక సీఎస్ రేసులో పేరు వినిపిస్తున్న మరో అధికారి డాక్టర్ సమీర్ శర్మ 1985 బ్యాచ్ అధికారి. నీలమ్ సహానీ పంజాబ్‌కి చెందినవారు. ఎమ్మెస్సీ పట్టభద్రురాలు. మృదుస్వభావిగా పేరుంది.

కాగా ప్రస్తుత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సస్పెండ్ చేసిన ప్రవీణ్ ప్రకాశ్ 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
TAGS: Neelam Sawhney, AP Chief Secretary, YS Jagan, LV Subramanyam, AP new CS

Leave A Reply

Your email address will not be published.