News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

జ‌న‌సేనకు ప్యాక‌ప్ ..పీకే మాట‌లపై జ‌న‌సైనికుల‌కు న‌మ్మ‌కం లేదా..?

జ‌న‌సేన పార్టీని న‌డిపిస్తాం.. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓడించినా.. రాజ‌కీయాల‌కు పేక‌ప్ చెప్ప‌ను.. న‌న్ను న‌మ్మ‌డి అంటూ.. రాజ‌కీయ‌ల్లోకి వ‌చ్చిన జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ల‌ను ప్ర‌జ‌లు మాత్రం న‌మ్మ‌లేదు. గ‌తంలో అన్న‌య్య‌, ఈ త‌మ్ముడు క‌లిసి ప్ర‌జారాజ్యం జంఢా పీకేసీన గుర్తుల‌ను ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేద‌న్న‌ట్లు.. మొన్న‌టి ఎన్నిక‌ల్లో జ‌గ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ను వెంటాడి..ఆయ‌న పోటీచేసిన  రెండు చోట్ల ఓడించారు. ఇక ప్ర‌స్తుతం ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్ర‌మే ఆపార్టీకి ఉన్నారు. అయితే.. ఈ ఓట‌మి త‌ర్వాత మ‌ళ్ళీ సేమ్ డైలాగ్ ప‌వ‌న్ అందుకున్నారు.. ఎన్నిక‌ల్లో ఓడించినా స‌రే.. ప్ర‌జ‌ల్లోనే ఉంటా.. జ‌న‌సేన‌తో ప్రశ్నిస్తూనే ఉంటా.. అని నెత్తిన నోరు పెట్టుకుని  ప‌వ‌న్ క‌ల్యాణ్ చెబుతున్నా.. ఇప్పుడు జ‌న‌సైనికులే న‌మ్మ‌డంలేదు. దీనితో.. నిన్న‌టి దాకా ఎన్నిక‌ల్లో జంఢా మోసిన నేత‌లు ముఖం చాటేస్తు.. ఏకంగా పార్టీ కార్యాల‌యాల‌నే మూసేస్తున్నారు.

pavan_kalyan_on_party_office_tolet
ప్రత్తిపాడులోని  గోరంట్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులోని  జనసేన ఆఫీస్ కు మూతవేశారు జ‌న‌సైనికులు. నిన్న‌టి దాకా పార్టీ ఉన్న కార్యాల‌యాన్నితాము ఇక‌నుండి నిర్వ‌హించ‌లేమ‌ని.. చేతులెత్తేశారు. ఇంకేముంది..  నిర్వహణ బాధ్యతలు ఎవరూ తీసుకోకపోవడంతో పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసేశారు. దీనితో భ‌వ‌న య‌జ‌మాని జ‌న‌సేనా కార్యాల‌యానికి టూలెట్ బోర్డ్ పెట్టేశారు. అంతేకాదు.. ఈ కార్యాల‌యాన్ని.. ఆఫిస్ కు లేదంటే..బార్ అండ్ రెస్టారెంట్  రెంట్ కు ఇస్తాన‌ని బోర్డ్ పెట్టారు య‌జామాని. అయితే ఇప్ప‌డికి ఆ కార్యాల‌యానికి జ‌న‌సేన పార్టీ పోస్ట‌ర్లు, ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌టౌట్లు ఉండ‌టం..తో ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ప‌త్తిపాటు నుండి.. జ‌న‌సేన త‌రుపున పోటీచేసి ఓడిపోయిన‌.. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. జ‌న‌సేన‌కు గుడ్ చెప్పి.. బిజేపీలోకి వెళ్ల‌డంతో.. ఇక జ‌న‌సేన జంఢా మోసేవారు లేక ప‌త్తిపాడు లోని పార్టీ ఆఫిస్ మూత‌ప‌డింది.
tolet_bord_at_janasena_party_office.

- Advertisement -

Tags: pavan kalyan, janasena party, to let bord, patthipadu, ap, pavan pareshan, ap politics

Leave A Reply

Your email address will not be published.