నిజామాబాద్ లో బ్యాలెట్ ఓటింగ్.. ఓటమి అంచున కవిత

news02 March 27, 2019, 10:42 p.m. political

Kcr bad time start

 

హైదరాబాద్ : అంతా నా యిష్టం.. నాకు ఎదురు లేనే లేదు అని పోకడలు పోతున్న కేసీఆర్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తోంది. అసెంబ్లీ y ఎన్నికల్లో 88సీట్లు గెలిచి తనకు ఎదురు లేదు అనుకుంటున్న టైమ్ లో షాక్ లు మొదలయ్యాయి. 

టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిట్టింగ్ అభ్యర్థులు ముగ్గురు పాతూరి సుధాకర్ రెడ్డి, పూల రవీందర్, సిట్టింగ్ సీటు అయిన గ్రాడ్యుయేట్ కోట ఎన్నికల్లో చంద్రశేఖర్ గౌడ్ ఘోరంగా ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ లో 1/3 ఏరియాల్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం కేసీఆర్ కు షాకింగ్ ఇచ్చింది. 

ఇప్పటికే మాజీ ఏంపి వివేక్.. కేసీఆర్ ను బజారుకు ఈడ్చారు. తనకు నమ్మకద్రోహం చేశారని.. టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు విలువ లేదని వివేక్ ..కేసీఆర్ నైజాన్ని బయట పెట్టారు. ఇక మహబూబ్నగర్ ఎంపి కేసీఆర్ తోనే వుంటానని చెప్పి బిజెపి లో చేరారు. దీంతో మహబూబ్ నగర్ లో బిజెపి బలపడింది.

Telqngana mlc elections reaults 

ఇకనిజామాబాద్ పార్లమెంట్ స్థానం లో 220 నామినేషన్ లు దాఖలు కావటం.. అక్కడ ఎంపి కవిత కు ఇబ్బందిగా మారటం తో కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. అక్కడ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాల్సి రావటం తో ఫలితం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వుంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ ఉపయోగించడం ద్వారా టీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగలటం తో ఇక్కడ కూడా అదే జరుగుతుందని చర్చ జరుగుతోంది. మొత్తంగా కేసీఆర్ కు ఇక బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే నని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

tags: Cm kcr oath, cm kcr new pic, cm kcr phone number, cm kcr family, cm kcr pics, pragathibvan, Telangana bavan, Ktr new pics, Telangana governer, governer narsimhan, Telangana Raj Bhavan, Telangana election symbals, nizamabad ballet voting, MP Kavitha, formers filed naminations, nizamabad record, MP elections.

Related Post