తాట తీస్తా ఏమనుకున్నారో

news02 June 23, 2019, 6:33 a.m. political

smrithi

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తన కుమార్తెను వేధించిన ఓ ఆకతాయిని ఘాటుగా హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో ఆమె స్పందించారు. జోయిష్ ఇరానీకి తల్లినైనందుకు గర్విస్తున్నాననీ... తన జోలికి వచ్చిన వాళ్ల సంగతి ఆమె చూసుకుటుందని సూటిగా వార్నింగ్ ఇచ్చింది స్మృతి ఇరానీ. ఇన్‌స్టాగ్రామ్‌లో తన కుమార్తె జోయిష్ ఇరానీ ఫోటోను పోస్టు చేసిన తర్వాత ఆమెకు ఎదురైన అనుభవాన్ని ఆమె చెప్పుకొస్తూ... నిన్న పోస్టు చేసిన నా కుమార్తె ఫోటోను డిలీట్ చేశాను.. ఫోటోలో ఆమె అలా చూస్తుండడంపై తన క్లాస్‌లోని ఓ ఇడియట్ ఆమెను ఎగతాళిచేశాడు.. తన తల్లి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఆమె ఎలా చూస్తున్నదో చెప్పాలంటూ తన తోటి విద్యార్ధులను కూడా రెచ్చగొట్టాడు.. దీంతో ఆ ఫోటోను చూపిస్తూ తనను ఏడిపిస్తున్నారనీ.. దాన్ని డిలీట్ చేయాలని నా కుమార్తె కోరింది.. ఆమె కంటతడి పెట్టడం ఇష్టంలేక నేను అందుకు అంగీకరించానని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పుకొచ్చింది
 smrithi
అంతే కాదు..తన కూతురు జోయిష్ ఇరానీ ఎవరికీ భయపడదని స్పష్టం చేసింది.  ఇక ఆ ఫోటో డిలీట్ చేయడం వల్ల ఆకతాయికి మరింత బలాన్ని ఇచ్చినట్టవుతుందని తర్వాత తనకు అనిపించిందని చెప్పింది. కాబట్టి అతడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే... నా కుమార్తె మంచి క్రీడాకారిణి.. లిమ్కా బుక్స్‌లో కూడా చోటు సంపాదించింది.. కరాటేలో సెకండ్ డాన్ బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు సార్లు కాంస్య పతకం కూడా గెలుచుకుంది.. మంచి కూతురు.. చాలా అందంగా కూడా ఉంటుంది.. మీరు ఎంత ఏడ్పించినా ఆమె తిరిగి పోరాటం చేయగలదు.. ఆమె జోయిష్ ఇరానీ.. ఆమెకు తల్లినైనందుకు గర్విస్తున్నానంటూ ఓ వైపు కన కూతురు గురించి గొప్పగా చెబుతూనే.. మరోవైపు సదరు పోకిరీని ఘాటుగా హెచ్చరించింది కేంద్ర మంత్రి  స్మృతి ఇరానీ.

 

tags: smrithi, smrithi irani, smrithi irani about her daughter, smrithi irani daughter, smrithi irani warned boy

Related Post