ఏఐసిసి అధ్యక్షులుగా రాహూల్ కొనసాగాలి

news02 June 24, 2019, 7:03 p.m. political

rahul

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కొనసాగుతారని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా వెల్లడించారు. ఈనెల 29న నాగార్జున సాగర్‌లో టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుందని ఆయన తెలిపారు. ప్రతి నెలా 1 నుంచి 3 తేదీల్లో మండల, జిల్లా , బ్లాక్‌ కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరుగుతాయని కుంతియా చెప్పారు. జులై మొదటివారంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల సమావేశం నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమిపై క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించుకొని విశ్లేషించుకొని చర్యలు తీసుకుంటామన్నారు కుంతియా. ఏఐసీసీ అధ్యక్షులుగా రాహుల్‌ గాంధీ కొనసాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన చెప్పారు.

tags: kuntiya, r c kuntiya, kuntiya about pcc chief, out uttam, kuntiya about pcc chief, kuntiya about komatireddy rajagopal reddy

Related Post