ఈ పండుగలో ఇదే మిస్ అయ్యింది

news02 June 21, 2019, 9:30 p.m. political

Kaleswaram opening cermani

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం అట్ట‌హాసంగా జ‌రిగింది. మూడు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, రెండు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ లు .. పురోహితుల మంత్ర ఉచ్చార‌ణ‌ల మ‌ధ్య కాళేశ్వ‌రం ప‌ట్టాలెక్కింది. అయితే ఇదంతా ఒక‌వైపు జ‌రుగుతుంటే అంద‌రి క‌ళ్ళు మాత్రం ఒక్క‌రినే వెతికాయి. ఆయ‌నే ఈ ప్రాజెక్టు నిర్మాణ స‌మ‌యంలో కాళ్ళ‌కు చక్రాలు క‌ట్టుకొని తిరిగిన హ‌రీష్ రావు. కాళేశ్వ‌రం అంటే హ‌రీష్ రావు..హ‌రీష్ రావు అంటే కాళేశ్వ‌రం అనే విదంగా ముద్ర‌ప‌డిన ఆయ‌న ఎక్క‌డ‌క‌నిపించ‌క‌పోయేస‌రికి సోష‌ల్ మీడియాతో పాటు సొంత పార్టీలో ఆయ‌నే హాట్ టాపిక్ అయ్యాడు.

 తెలంగాణ సీఎం కేసీఆర్ కల‌ల సౌధం కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభ‌మైంది. మూడేళ్ళ‌కే ప్రాజెక్టు ప్రారంభించ‌టంతో కాళేశ్వ‌ర్ ప్రాజెక్టు రికార్డు సాధించింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు .. ఏపీ సీఎం జ‌గ‌న్‌, మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీస్‌, మ‌హారాష్ట్ర గ‌వర్న‌ర్ విద్యాసాగ‌ర్ ముఖ్య అథితులుగా హాజ‌ర‌య్యారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ జిల్లాల‌కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు హాజ‌రయ్యారు. త‌లా ఒక శిలాఫ‌ల‌కాన్ని ఓప‌న్ చేసి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేశారు. ఇదంతా బాగానే ఉన్నా ఆ ఒక్క‌రిపైనే రాష్ట్ర‌మంతా చ‌ర్చ జ‌రిగింది.  

Kaleswaram praject opening cermany

కాళేశ్వ‌రం ప్రాజెక్టు కేసీఆర్ అంకురార్ప‌ణ చేసిన నాటినుంచి ఆనాడు పార్టీలోనూ ప్ర‌భుత్వం లోనూ కీల‌క పాత్ర పోషించారు హ‌రీష్ రావు. ప్రాజెక్టు రీ డిజైన్ ద‌గ్గ‌ర‌నుంచి నిర్మాణ ప‌నులు పూర్త‌య్యే వర‌కు కాలికి బ‌లపం క‌ట్టుకొని తిరిగారు హ‌రీష్ రావు. ప‌గ‌ల‌న‌క‌, రాత్ర‌న‌క ప్రాజెక్ట్ వ‌ద్దే ఉండి నిర్మాణ ప‌నులు వేగంగా పూర్తి చేయించ‌టంలో ఆయ‌న పాత్ర‌ను ఎవ‌రూ కాద‌న‌లేద‌నే చ‌ర్చ టీఆర్ ఎస్ పార్టీలోనూ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి గా కాళేశ్వరం పైనే పూర్తి ఫోక‌స్ పెట్టి .. భూసేక‌ర‌ణ లాంటి సున్నిత‌మైన అంశాల‌ను ప‌రిష్క‌రించ‌టంలో త‌న‌దైన పాత్ర పోషించారు. ఇక కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌పై ప్ర‌తి ప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను సైతం తిప్పికొట్టి వారికి దీటుగా స‌మాదానం ఇచ్చారు. 

Kaleswaram praject opening cermany

అలాంటి హ‌రీష్ రావును కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంబోత్సవానికి అహ్వానిస్తారా లేదా అన్న చ‌ర్చ గ‌త వారం రోజుల నుంచి జోరుగా సాగింది. అయితే కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఓప‌నింగ్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న క‌న‌ప‌డ‌క‌పోయే స‌రికి చ‌ర్చ అంతా హ‌రీష్ రావుపైనే జ‌రిగింది. హ‌రీష్ రావును ఒక్క‌రినైనా పిల‌వాల‌ని ప్ర‌తి ప‌క్షాలు సైతం డిమాండ్ చేశాయి. దీనికి తోడు సోష‌ల్ మీడియాలోనూ హ‌రీష్ రావు పైనే చ‌ర్చ జ‌రిగింది. గ‌తంలో హ‌రీష్ రావును.. కాళేశ్వ‌ర్ రావుగా గ‌వ‌ర్న‌ర్ న‌ర్సింహ్మ‌న్ పొగిడిన వీడియో తాజాగా వైర‌ల్ అవటం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాళేశ్వ‌రం క్రెడిట్ హ‌రీష్ రావుదేనంటూ నెటిజ‌న్లు కామెంట్స్ ట్రోల్ చేశారు. 

ఇదిలా ఉంటే కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంబోత్స‌వాన్ని రాష్ట్ర‌మంతా సంబ‌రాలు జ‌ర‌పాల‌ని కేసీఆర్ .. ఆదేశాలిచ్చారు. దీంతో ఎమ్మెల్యేలంతా త‌మ‌త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో బాణ సంచా కాల్చి సంబ‌రాలు జ‌రిపారు. హ‌రీష్ రావు కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గం సిద్దిపేట ప‌రిధిలోని రంగ‌నాయ‌క సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ వ‌ద్ద సంబ‌రాల్లో పాల్గొన్నారు. హ‌రీష్ రావును పిల‌వ‌క‌పోవ‌టంపై సొంత పార్టీ నేత‌లు సైతం గుస‌గుస‌లాడినా .. త‌ను మాత్రం ఈ ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్ కే చెందుతుంద‌ని చెప్పారు. మొత్తానికి కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం క‌న్నా హ‌రీష్ రావుపైనే ఆస‌క్తిక‌ర చ‌ర జ‌రిగింది.

tags: Harish Rao, kaleswaram praject, kaleswaram praject lift irrigation scheme, world highest lift irrigation scheme, kannepalli pump house, medigadda barrage, Ap cm Jagan visit kaleswaram, Maharastra cm parnavis, telangana irrigation praject, cm kcr yagam, cm kcr family, cm kcr wife Shoba.

Related Post