మోడీ సాబ్ ..ఆప్ కో క్యా హోగయా ..

news02 Feb. 21, 2019, 10:55 p.m. political

congress_target_modi_on_terrer_attack

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలకు మరింత పదును పెట్టింది. పక్కా సమాచారం ఉన్నా ఈ దాడిని ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించింది. ఉగ్రదాడులపై నిఘా వర్గాల నుంచి స్పష్టమైన సమాచారం ఉన్నా మోదీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతున్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా,  ఢిల్లీ మాజీ మంత్రి, హరూన్ యూసఫ్ ప్రశ్నించారు. ‘‘నరేంద్ర మోదీ మూడు కేజీల బీఫ్ ఎక్కడున్నా పసిగట్టగలరు... మరి 350 కేజీల ఆర్‌డీఎక్స్‌ను ఎందుకు పట్టుకోలేక పోయారు..’’ అని హరూన్ యూసఫ్ సెటైర్ విసిరారు. గోవధపై దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులతో పాటు ఇటీవల పుల్వామాలో జరిగిన ఆర్డీఎక్స్ దాడిని ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు సైనికుల మరణంతో యావత్ దేశం రోదిస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా గడిపారంటూ రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. మోడీ తీరు ఇండియన్ ఆర్మీనే కాదు ..యావత్తు భారత జాతిని అవమానించడమే అని మండిపడ్డారు.

tags: pulwama terrer attack,pakisthan, rahul gandhi, randheep surjiwala, delhi ex minister, haroon yunaf, rdx, beief, govadha, cammunal,kashmir

Related Post