ఎంపీగా ప్రజల రుణం తీర్చుకుంటా..

news02 June 5, 2019, 8:18 p.m. political

Pcc chief utham Kumar Reddy resigned for huzurnagar mla

హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాజాగా నల్గొండ ఎంపి గా గెలుపొందిన ఉత్తమ్.. హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శి నర్సింహ ఆచార్యులకు అందజేశారు. 

గత మూడు దశాబ్దాలుగా కోదాడ, హుజుర్ నగర్ నియోజక వర్గాల ప్రజలు తనను ఎంతో ఆదరించారని వారి కుటుంబ సభ్యులలో ఒకరిగా ఎంతో ప్రేమగా చూసుకున్నారని వారి అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని నల్గొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. తనను కోదాడ, హుజుర్ నగర్ ప్రజలు ఎంతో ఆదరించారని, ఎంపీ గా కూడా గెలిపించి వారి అభిమానానికి చాటుకున్నారని అన్నారు. నల్గొండ ఎంపీగా గెలిచిన రాజీనామా అనివార్యం అయిందన్నారు.

Pcc chief utham designed for mla post

 ఎంపీ గా ఆ రెండు నియోజకవర్గాలతో పాటు మరో 5 నియోజక వర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం ఉందని ఇది అదృష్టంగా భవిస్తున్నానని అన్నారు. నా ప్రాణం ఉన్నంత కాలం నాకు ప్రజాసేవ చేసుకుందుకు అవకాశం ఇచ్చిన నియోజక వర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, వారి సేవకే అంకితం అవుతానని అన్నారు.

5 సార్లుఎమ్యెల్యే గా పనిచేసిన ఉత్తమ్. 1999, 2004 లలో కోదాడ నుంచి 2009, 2014, 2018 లలో హుజుర్ నగర్ నుంచి ఎమ్యెల్యే గా.. 2019 లో నల్గొండ ఎంపీ గా పనిచేశారు. శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్ గా 610 జిఓ హౌస్ మైంటెన్ కమిటీ చైర్మన్ గా పని చేసారు. హౌసింగ్ మంత్రి గా కూడా పనిచేశారు.

tags: Pcc chief utham Kumar Reddy, Telangana Congress, huzurnagar mla, utham Kumar Reddy family, 2018 Telangana assembly elections, utham Padmavathi Reddy, nalgonda MP, utham Kumar Reddy address, Telangana chief , Gandhi Bhavan, congress nalgonda, nalgonda loksabha.

Related Post