శారదా పీఠానికి అప్పనంగా భూమి

news02 June 23, 2019, 7:08 a.m. political

sarada peetham

విశాఖ పట్నం శారదా పీఠానికి రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా రెండెకరాల స్థలాన్ని కెటాయించింది. సర్వే నంబర్‌ 240లో రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఇటీవలి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంద. కోకాపేట్ లో రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువ ఎకరాకు ఒక కోటి 50 లక్షల రూపాయలు ఉండగా బహిరంగ మార్కెట్‌ విలువ ఎకరాకు 12 కోట్ల రూపాయలు పలుకుతోంది. అయితే, శారదా పీఠానికి ఎకరానికి కేవలం ఒక్క రూపాయి చొప్పున రెండెకరాలు 2రూపాయలకే కేటాయిస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. దేవాలయం, వేదభాషా గోష్ఠి మఠం, సంస్కృత విద్యాసంస్థ, విద్యార్థుల వసతి, భోజనశాల, సమావేశ మందిర నిర్మాణాలకు స్థలం కేటాయించాలని శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శారదా పీఠానికి రెండెకరాల స్థలాన్ని కెటాయిస్తూ కేసీఆర్ సర్కార్ జీఓ జారీ చేసింది.
 

tags: sarada peetham, kcr given land to sarada peetham, cm kcr gift land to sarada peetham, ts govt given land to sarada peetham, telangana govt given land to sarada peetham

Related Post