మిషన్ 150 ప్లస్ 25

news03 March 18, 2019, 7:13 a.m. political

babu

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ధర్మయుద్ధంలో టీడీపీదే విజయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా  వ్యక్తం చేశారు. ఎలక్షన్ మిషన్ 2019పై చంద్రబాబు మంత్రులు, ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా నేతలకు ప్రచారంపై పలు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రెండు విడతలుగా 151 మంది అభ్యర్ధులను ప్రకటించామని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సమయంలో మిగతా పార్టీల కంటే ముందు మనమే ముందున్నామని పార్టీ నేతలతో ముఖ్యమంత్రి అన్నారు. 

babu

తిరుమల ఏడు కొండలవాడు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టామని.. ఇక మనకంతా మంచే జరుగుతుందని చంద్రబాబు చెప్పారు.  చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభలు విజయవంతమయ్యాయని చంద్రబాబు తెలిపారు. ఇక ఎన్నికలకు ఇంకా 24రోజుల సమయమే ఉందన్న ముఖ్యమంత్రి.. కంటి మీద కునుకు లేకుండా నేతలు, కార్యకర్తలంతా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకోవాలని స్పష్టం చేశారు.

tags: babu, chandra babu, cm babu, cm chandra babu. chandra babu election campaign, babu election campaign, cm chandra babu election campaign

Related Post