మామా.. అల్లుడు మధ్య వార్

news02 Feb. 19, 2019, 10:36 p.m. political

Harish Rao no position in trs

హైదరాబాద్ : హరీష్ రావు కు మంత్రి పదవి విషయంలో సీఎం కేసీఆర్ అనుకున్నంత పని చేశారు. హరీష్ రావు ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు కొన్ని రోజులుగా టిఆర్ఎస్ లో జరిగిన పరిణామాలపై పార్టీ వర్గాల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. అందరు అనుకుంటున్నట్లె హరీష్ కు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వక పోవటం పై లోలోపల ఏదో ఫైటింగ్ జరుగుతోందన్న చర్చ జరుగుతుంది. ఇక ఇప్పుడు హరీష్ రావు ఏం చేయబోతున్నారు అన్న దానిపైనే అనేక అంచనాలు వినిపిస్తున్నాయి. 

నిజానికి హరీష్ రావు కు కేసీఆర్ కు మధ్య మాటలు లేక రెండు నెలలు దాటి పోయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే కొన్ని రోజుల ముందు ఇద్దరి మధ్య మాటలు లేవని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి . హరీష్ రావు తన సొంత ఫోన్ నుంచి బిజెపి నేతలతో మాట్లాడినట్టు కెసిఆర్ వద్ద కాల్ డేటా ఉన్నట్లు కొందరు నేతలు అనుకుంటున్నారు. ఈ విషయంపై కేసీఆర్ ..హరీష్ రావు కు మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి హరీష్ రావు పై కేసీఆర్ గా గుర్రు గా ఉన్నారని సమాచారం.

ఎలాగూ మంత్రివర్గంలో చోటు లేదు హరీష్ రావు ఇప్పుడు ఏం చేస్తారు మామను ఎదిరిస్తారా..? మౌనంగా సర్దుకుపోతారా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు హరీష్ రావు వెంట వచ్చేందుకు ఎమ్మెల్యేలు ఎవరూ సిద్ధంగా లేరు. నిన్న మొన్నటి వరకు హరీష్ వెంట ఉన్న చాలామంది నేతలు కేటీఆర్ శిబిరంలోకి మారిపోయారనీ టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. ప్రస్తుతం వారంతా కేటీఆర్ కనుసన్నల్లో వస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమందికి హరీష్ రావు ఫండింగ్ చేశారనే ప్రచారం ఉన్నప్పటికీ ఆ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వెంట వెళ్లేందుకు ధైర్యం చేయకపోవచ్చని భావిస్తున్నారు.

Harish Rao with ktr

కాంగ్రెస్ సంబంధించిన ఒకరిద్దరు నేతలు హరీష్ రావును టార్గెట్ చేయడం వెనుక కేసీఆర్ కుటుంబం ఉందా అన్న చర్చ కూడా టిఆర్ఎస్ లో జరుగుతుంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హరీష్ టార్గెట్ గా వారానికి రెండు మూడు సార్లు మీడియా ముందుకు రావడం అందరికీ అనుమానం కలిగిస్తోంది . హరీష్ రావు పై జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఖందించటం లేదు. హరీష్ రావు కూడా ఈ విషయంపై మిన్నకుండిపోతున్నారు. అనువుగాని చోట అధికులమనరాదు అన్న సామెతను హరీష్ రావు బాగా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరమైన ఆలోచనలు చేయటం కన్నా.. మౌనంగా ఉండడమే మంచిదనీ ఆయన అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తుంది.

 హరీష్ రావు ఎలాగో మంత్రివర్గంలో తీసుకోలేదు. వచ్చే లోక్ సభ ఎన్నికల తో ఆయనను ఎంపీగా ఢిల్లీ కి పంపే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హరీష్ రావును ఢిల్లీకి పంపడం ద్వారా కేటీఆర్ కు రూట్ క్లియర్ చేసినట్లు అవుతోంది. అసెంబ్లీకి హరీష్ రావు సీనియర్ నేత.. పార్లమెంటుకు కొత్త సభ్యులు కాబట్టి ఆయనకు అక్కడ ఏ పదవి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. హరీష్ రావుకు నేరుగా ప్రజలతో సంబంధాలు తెగిపోతాయి. దీంతో హరీష్ రావు ను రాజకీయంగా పర్మనెంట్ చెక్ పెట్టే అవకాశం ఉండొచ్చని అనుకుంటున్నారు. మొత్తానికి మామ అల్లుళ్ళ పంచాయతీ ఎంతవరకు వెళ్తుందో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది.

tags: Harish Rao, Ktr, kcr family, kaleswaram project, Telangana irrigation projects, kcr son, cm kcr cell nber, cm kcr Telangana, pragathibavan.

Related Post