మోదీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు

news02 March 16, 2019, 7:52 p.m. political

rahul

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై ఎందుకు మాట్లాడటం లేదని ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధి ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌లో పర్యటించిన రాహూల్.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రఫేల్‌ యుధ్ద విమానాల ఒప్పందంపై మాట్లాడమని తానును డిమాండ్ చేస్తే.. పార్లమెంటులో ప్రధాని మోదీ మాట్లాడలేదని విమర్శించారు. రఫేల్ యుధ్ద విమానాల ఒప్పందంపై మాట్లాడే ధైర్యం ప్రధానికి లేదని రాహూల్ వ్యాఖ్యానించారు. కాపలాదారుడే దొంగ అని కామెంట్ చేసిన రాహూల్.. దేశంలో వ్యవసాయ సంక్షోభం ఉందని అన్నారు. 

rahul

ఇటీవల జరిగిన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే  రైతు రుణమాఫీ చేసిన సంగతిని గుర్తు చేశారు. ప్రధాని మోదీ గత ఎననికల సందర్బంగాను చాలా హామీలు ఇచ్చారన్న రాహూల్.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని చెప్పారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్టామన్నారు కానీ.. ఏ ఒక్క హామీ నెరవేర్చిన పాపాన పోలేదని ఘాటుగా విమర్శించారు. 

 

tags: rahul, rahul gandhi, aicc president rahul, aicc chief rahul, rahul fire on modi, rahul gandhi fire on modi, rahul fire on pm modi

Related Post