చిరంజీవి " ఖైదీ నెం 150 " .. కేసీఆర్ టార్గెట్ సినిమానా..?

హైదరాబాద్ : చిరంజీవి 9 ఏళ్ళ తర్వాత నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా బాగుందనే టాక్ వచ్చింది. అయితే అదే సమయంలో ఈ సినిమా లోని కొన్ని సన్నివేశాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. రొమాంటిక్, గ్లామర్ సన్నివేశాలతో ఎవరికి ఇబ్బంది లేకున్నా.. సామజిక కోణం టచ్ చేసిన సంఘటనలు తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి తీశారని టాక్ వినిపిస్తుంది. శంకర్ పాత్రలో చిరంజీవి సామజిక అంశాలను స్పృజించాడు. భూ సేకరణ అంశం..కార్పొరేట్ కంపెనీ ల భూ దాహం.. రైతుల ఐక్య పోరాటంలో రైతు విజయం..చాల బాగా చూపించారు.. 2014 ఎన్నికల ముందు ఒకేసారి రుణ మాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పిన విషయంలో అపుడు ఏం చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటూ కెసిఆర్ ప్రభుత్వాన్ని పరోక్షంగా మొట్టికాయ వేశారు. వ్యవస్థ లోపాలను బాగా ఎత్తి చూపారు.. మీడియా ను సున్నితంగా సునిషితంగా విమర్శించారు..బ్రేకింగ్..సెన్సేషన్ కోసం వెంపర్లాటలో సామజిక సమస్యలను చిన్నగా చూస్తున్నారని చెపుతూ మీడియా భాధ్యతను గుర్తు చేసారు. అయితే ఇది రీమేక్ సినిమా అన్న విషయం తెలిసిందే. తమిళ్ లో హిట్ అయిన కత్తి సినిమా రీమేక్ ఇది. కాబట్టి ఇందులో సీన్ లు సీఎం కేసీఆర్ కు గాని ఎవరికి సంభదం లేవనే వాదన కూడా వినిపిస్తుంది. అయితే సినిమా రీమేక్ అయినా ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా సినిమా కథలో కొన్ని మార్పులు చేశారు. ఇక్కడే ఎవరినో టార్గెట్ చేసి సినిమా తీశారనే అనుమానం కలుగుతోంది.

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.