చుట్టాలబ్బాయి రివ్యూ.

సినిమా పిల్లర్- ఆది నటించిన చుట్టాలబ్బాయి సినిమా ఎక్స్ క్లూజివ్ రివ్యూ న్యూ పిల్లర్ రీడర్స్ కోసం......
సినిమా: చుట్టాలబ్బాయి
రేటింగ్ - 5/10
దర్శకత్వం - వీరభద్రం
నిర్మాత- వెంకట్ తలారి, రామ్ తల్లూరి
సంగీతం- ఎస్.ఎస్.తమన్
నటీనటులు - ఆది, నమిత ప్రమోద్, సాయి కుమార్
చాలా కాలంగా చతికిల పడ్డ ఆదికి హిట్ కావలి, అందుకే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని నమ్ముకొని చుట్టాలబ్బాయి సినిమా చేశాడు. వీరబద్రం చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఫస్ట్ లుక్ నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. పదేళ్ళపాటు గుర్తుండిపోయే సినిమా అంటూ ప్రచారం సాగింది. మనం వంటి మరో సినిమా అంటూ క్రేజ్ పుట్టించారు. మరి ఆ అంచనాలని ఈ సినిమా అందుకుంటుందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
చిత్ర కథ:
బాబ్జీ (ఆది) ఓ బ్యాంకులో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. మొండి బాకీలని ఎలా వసూలుచేయాలో తెలిసినవాడు. కావ్య(నమిత ప్రమోద్) ఏసీపీ కం ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ (అభిమన్యు సింగ్) ఒక్కగానొక్క చెల్లెలు. కావ్య ఓ సారి బాబ్జీతో చనువుగా ఉండటం చూసి బాబ్జీకి వార్నింగ్ ఇస్తాడు ఏసీపీ. నిజానికి కావ్య, బాబ్జీల మధ్య కనీసం స్నేహం కూడా ఉండదు.
ఓ సారి ఇంటి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది కావ్య. అదే సమయంలో ఆమెకూడా అనుకోకుండా బాబ్జీ కనిపించడంతో 'వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని పారిపోతున్నారు' అని ఫిక్స్ అయిపోతారు పోలీసులు. అక్కడి నుంచి బాబ్జీ, కావ్యాల వెంతపడుతారు పోలీసులు. వారిని  తప్పించుకునే ప్రయత్నంలో ఉండగానే మరో ముఠా కూడా కావ్యకోసం వెతుకుతుంది. ఈలోగా దొరబాబు(సాయి కుమార్) మనుషులు బాబ్జీ కావ్యలను కిడ్నాప్ చేస్తారు. అసలీ దొరబాబు ఎవరు? తనకు తెలియకుండానే బాబ్జీ ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కున్నాడు అనేదే ‘చుట్టాలబ్బాయి’ కథ.
నటీనటుల ప్రతిభ :
రాక్ స్టార్ ఆది మునపటి సినిమాలకంటే ఈ సినిమాలో కాస్త జోష్ ఫుల్ గా కనిపించాడు. లుక్ పరంగా, డైలాగ్ పరంగా, డాన్స్ పరంగా ఆది అందరిని ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన నమితా ప్రమోద్ పరవాలేదని అనిపిచుకుంది. హీరోయిన్ కు స్కోప్ ఉన్నా ఆమె నటనకు జస్ట్ ఓకే అనిపిస్తుంది. అక్కడక్కడ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది తప్ప సినిమా అంతా హీరోయిన్ అంతగా ఆకట్టుకోదు. ఇక దొరబాబుగా సాయి కుమార్ హుందాగా కనిపించే పాత్రలో నటించాడు.
తనకు కొట్టిన పిండి లాంటి ఇలాంటి పాత్రలో సాయి కుమార్ ఓకే అనిపించుకున్నాడు కానీ, ఆ పాత్రకు అంత బలం లేకపోవడం మైనస్ అయ్యింది. ఇక ఆది ఫ్రెండ్స్ గా నటించిన రవి, సుదర్శన్, శకలక శంకర్ కామెడీ పండించారు. అలీ ఉన్న కొద్దిసేపు నవ్వులు పండించే ప్రయత్నం చేశాడు. అసలీ దొరబాబు ఎవరు? తనకు తెలియకుండానే బాబ్జీ ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కున్నాడు అనేదే ‘చుట్టాలబ్బాయి’ కథ.
సాంకేతిక విభాగం:
నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా చూస్తున్నంత సేపు నిర్మాతలు పెట్టిన ఖర్చు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కెమెరా పనితనం కూడా చాలా బాగుంది. పల్లెటూరి నేపధ్యంలో సాగే రెండో భాగంలో కెమెరా వర్క్ అందంగా ఉన్నది. 30ఇయర్స్ పృధ్వీ, శకలక శంకర్ పాత్రలకు రాసిన కామెడీ పంచ్ డైలాగ్స్ బాగున్నాయి.
తమన్ అందించిన సంగీతం మొదటి పాటలో బాగుండి మిగితా అంతా పరవాలేదని అనిపించుకుంది. ఎడిటింగ్ బాగున్నది. దర్శకుడు వీరభద్రం విషయానికొస్తే కథని మొదలుపెట్టిన తీరు, కామెడీ ట్రాక్ ను కథతో పాటే నడిపిన విధానం బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో ఆకట్టుకునే సన్నివేశాలు, కొత్తదనం పూర్తిగా లోపించాయి.

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.