హైద‌రాబాద్ పోలీసుల‌ను న‌మ్ముకుంటే ఊడ్చుకు తిని లైట్ తీస్కో అన్నారు.

హైద‌రాబాద్ః హైదరాబాదు మహానగరంలో సంక్రాంతి సెలవులను పురస్కరించుకుని ఎవరైనా ఇల్లు వదిలి వెళ్తే తమకు సమాచారమిస్తే ఓ కన్నేసి ఉంచుతామని మీ భద్రతకు మాదీ భరోసా అంటూ పోలీసులు చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వనస్థలిపురంలో ఓ వ్యక్తి తాను ఊరెళ్తున్నానని, నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న తన ఇంటిపైనిఘా ఉంచాలని పోలీసులను కోరాడు. తన ఇంటి తాళం చెవులు కూడా పోలీసుల చేతుల్లో పెట్టాడు. దీనిని మంచి అవకాశంగా భావించిన పోలీసులు, ఆ ఇంటిని గెస్ట్ హౌస్ గా వాడుకున్నారు. మద్యం బాటిళ్లు, మాంసాహారంతో ఆ ఇంట ప్రవేశించి పార్టీ చేసుకున్నారు. మంచి పార్టీలో ఉండగా వచ్చిన ఇంటి యజమానిని చూసిన కానిస్టేబుళ్లు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి ఇదేంటని ప్రశ్నించడంతో 'లైట్ తీసుకో'మని చెప్పి వెళ్లిపోయారు.

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.