త‌మను టార్గెట్ చేస్తున్న వారిపై చిరంజీవి ఘాటు వాఖ్య‌లు

హైద‌రాబాద్ః మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నంబ‌ర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ సంద‌ర్బంగా నాగ‌బాబు చేసిన హాట్ కామెంట్స్ ర‌చ్చ ఇంకా కొన‌సాగుతోంది. ఈ విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి స్పందించ‌లేదు. మొద‌టి సారి ఈ వివాదాల‌పై మెగాస్టార్ చిరంజీవి ఘూటు వాఖ్య‌లు చేశారు. తెలుగు టీవీ న్యూస్ చాన‌ళ్ళ‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో చిరంజీవి ఘూటు వాఖ్య‌లు చేశారు.

త‌న కుటుంభంపై కొంద‌రు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నార‌ని అన్నారు. ర‌చ‌యిత‌ యండ‌మూరి కి సంస్కారం లేదని చిరంజీవి మండి ప‌డ్డారు. త‌మ కుటుంభాన్ని కించ‌ప‌రిచేవిగా ఉన్నాయ‌ని అన్నారు. త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తే తాను ప‌ట్టించుకోన‌ని చిరంజీవి చెప్పారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ చిన్న‌ప్ప‌టి నుంచి ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడ‌ని చెప్పారు. తాను ఇంకా కాంగ్రెస్ కు దూరం కాలేదని చెప్పిన చిరంజీవి .. భ‌విష్య‌త్ లో ప‌వ‌న్ క‌ళ్యాన్ , తాను రాజ‌కీయాల్లో క‌లిసి ప‌నిచేసేది కాల‌మే నిర్ణ‌యిస్తుందని చెప్పారు.  

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.