నన్ను లాక్కేళ్లిపోయారని రాస్తారా..

సినిమా పిల్లర్- బాలీవుడ్ అందాల భామ శ్రద్ధాకపూర్‌, ఫర్హాన్‌ అక్తర్‌ మద్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నదని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది..ఇక ఇది చాలదన్నట్లుగా ఇటీవల వీరిపై మరో పుకారు పుట్టుకువచ్చింది. అదే  శ్రద్ధ తన మకాంను ఏకంగా ఫర్హాన్‌ ఇంటికి మార్చేసిందని. ఈ విషయం తెలిసి ఆమె తండ్రి శక్తికపూర్‌.. ఆమెను ఇంటికి లాక్కెళ్లిపోయినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై  శ్రద్ధకపూర్‌ చాలా సీరియస్‌ అయ్యింది. సాధారణంగా నా సహనటులతో రిలేషన్‌ ఉందంటూ వచ్చే పుకార్లను పట్టించుకోను. వాటి గురించి పెద్దగా బాధపడనని చెప్పింది.

ఐతే ఈసారి ఇలాంటి వార్తల్లోకి నా కుటుంబాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ విషయం నన్ను చాలా బాధపెట్టింది. కొంతమంది నిజాలను తెలుసుకోకుండా కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. వాళ్లు వాస్తవాలను తెలుసుకోవాలి. అంతే తప్ప వూహించుకొని ఇలాంటి కట్టుకథలు రాయడం సరికాదు. అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది ఈ నెరజాన.

 

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.