థియేటర్లలో "తిక్క" లేపుతున్న సినిమా ( రివ్యూ)

సినిమా పిల్లర్ : మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ హీరోగా ఎదుగుతున్నాడు. ఇప్పటివరకు కమర్షియల్ చిత్రాల్లో నటించిన తేజు మొదటిసారిగా ఓ కొత్త జోనర్ ను ప్రయత్నించాడు. అదే 'తిక్క' సినిమా. 'ఓం' చిత్రం తరువాత సునీల్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తేజుకి, సునీల్ కు  ఎలాంటి విజయాన్ని తెచ్చి పెట్టిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!  కథ: ఆదిత్య(సాయి ధరం తేజ్) రియల్ ఎస్టేట్ కంపనీలో పని చేసే ఓ ఉద్యోగి. అప్పటివరకు మందు, సిగరెట్, అమ్మాయిలే లోకంగా బ్రతికే ఆదిత్య జీవితంలోకి అంజలి(లారిస్సా బొనేసి) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. అంజలిని ప్రాణంగా ప్రేమించిన ఆదిత్య తన కోసం దూరలవాట్లను, తను ఎంతగానో ఇష్టపడే తన తండ్రికి, తన ప్రాణ స్నేహితుడుకి దూరమవుతాడు. అంజలి కూడా ఆదిత్యను నిజాయితీగానే ప్రేమిస్తుంది. కానీ ఒకానొక సంధర్భంలో ఆదిత్యకు బ్రేకప్ చెప్పాల్సిన పరిస్తితి కలుగుతుంది. అంజలి నిజంగానే తనకు బ్రేకప్ చెప్పిందని భావించిన ఆదిత్య మళ్ళీ పాత ఆదిత్యగా మారిపోతాడు. ఈ నేపధ్యంలో తన జీవితంలోకి కొన్ని చిత్రవిచిత్రమైన పాత్రలు ఎంటర్ అవుతాయి. వారి వల్ల ఆదిత్య సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఇంతకీ ఆదిత్యకు ఎదురైన ఆ సమస్యలేంటి..? వాటిని ఎలా అదిగమించాడు..? అంజలితో ఆదిత్య ప్రేమ సుఖాంతం అయిందా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!  విశ్లేషణ: సినిమా మొదలయినప్పటి నుండి కొత్త పాయింట్, కొత్త జోనర్ అని డైరెక్టర్ అండ్ కో కొట్టిన డబ్బా అంతా ఇంతా కాదు. నిజంగానే కొత్త కాన్సెప్ట్ అనుకొని థియేటర్ కు వెళ్ళే ఆడియన్స్ కు ఈ సినిమా పెద్ద పరీక్ష అనే చెప్పాలి. అమ్మాయిని ప్రేమించడం, తన కోసం అందరినీ వదులుకోవడం, తను బ్రేకప్ చెప్పిందని మళ్ళీ దూరాలవాట్లకు దగ్గరవ్వడం ఇలాంటి అంశాలతో మొదటి భాగం నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో అయినా.. కథను రివీల్ చేస్తారనుకుంటే పొరపాటే. అసలు కథ ఉంటేనే కథ మనకు చెప్పడానికి.. అసలు కథ లేకుండా ఏవేవో క్యారెక్టర్స్ ను క్రియేట్ చేసి సినిమానురన్ చేయడంలో పెట్టిన ఫోకస్ కథ విషయంలో పెట్టి ఉండే బావుండేది. కన్ఫ్యూజన్ కామెడీ జోనర్ కు చెందిన సినిమా ఇది. ఆ కన్ఫ్యూజన్ లో నుండి ఎలాంటి కామెడీ పుట్టలేదు. పైగా కొన్ని క్యారెక్టర్స్ చేసే ఓవర్ యాక్షన్ తో విసుగు పుడుతుంది. రాజేంధ్ర ప్రసాద్, అలీ, అజయ్, రఘుబాబు, తాగుబోతు రమేశ్, సప్తగిరి ఇలా ఎంతమంది ఆర్టిస్ట్స్ ఉన్నా.. సినిమాను మాత్రం నడిపించలేకపోయారు. అసలు మన్నారా చోప్రా ఉపయోగం లేని పాత్రలో ఎలా నటించిందో.. ఆమెకే తెలియాలి. సినిమాను రిచ్ గా చూపించాలని సగానికి సగం సినిమాను ఫారెన్ లొకేషన్స్ షూట్ చేశారు. అదేమీ సినిమాకు ప్లస్ కాలేదు. తమన్ మ్యూజిక్ అంతంత మాత్రంగానే ఉంది. ఫోటోగ్రఫి పర్వాలేదనిపించింది. కథలో సత్తా  లేనప్పుడు ఏం చేస్తే ఎందుకు చెప్పండి..? ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో నరకం చూపించేశారు. వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో సినిమాకు వెళ్లాలనుకునే వారు ఈ సినిమాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రేటింగ్ : 4/10 NKTE : ( బేసిక్ గా తిక్క వున్నవాళ్ళు ఈ సినిమా కు వెళ్ళకపోవటం ఆరోగ్య రీత్యా మంచిది)

Related News

Newspillar Exclusives

Movies News More

Political News More

© 2016 NewsPiller. All rights reserved.