News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఢిల్లీలో జోరుగా “ప్యూర్ ఆక్సిజన్” గాలి అమ్మ‌కాలు…

ఈ ప్ర‌పంచ మ‌నుగ‌డ‌లో..శాస్త్ర సాంకేతిక రంగాల్లో భార‌త్ పాత్ర‌ను త‌క్క‌వ చేయ‌లేం..ఇప్పుడు గాలిని వ్యాపారంగా మార్చిన దేశంగాను గుర్తింపు పొందుతోంది. వాయు కాలుష్యంతో అల్లాడిపోతున్న ఢిల్లీ వాసుల కోసం ఆక్సిజ‌న్ స్టాల్స్ ఏర్పాటు ఊపందుకుంటోంది. ఢిల్లీలోని సిటీ వాక్ మాల్, సాకేత్ తో ప్యూర్ ఆక్సిజన్ అనే సంస్థ‌ల‌ పేరిట కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. అక్కడ ప్యూర్ ఆక్సిజన్ ను వివిధ ఫ్లేవర్స్ తో మిక్స్ చేసి అమ్ముతుండ‌టం గ‌మ‌నార్హం.  ఈ ప్యూర్ ఆక్సిజన్ ధర రూ. 299 రూపాయల నుంచి  ప్రారంభ‌మ‌వుతోంది. ఈ ఆక్సిజ‌న్ స్టాల్ కు ఎక్కువ గిరాకీ ఉండటంతో డిసెంబర్‌లో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు దగ్గరలో మరో స్టాల్  ఏర్పాటు చేయబోతున్న‌ట్లు నిర్వాహాకులు చెబుతున్నారు.

అయితే గాలిని కొనుక్కోవాల్సి రావ‌డం ఇది బాధాక‌రం క‌లిగించే అంశ‌మ‌ని ఢిల్లీ ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాలుష్యం కోర‌లు చాస్తుండ‌టంతో ఊపిరి సంబంధిత వ్యాధుల‌తో జ‌నం అల్లాడిపోతున్నారు. అనేక మంది ఢిల్లీలో ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. వాహ‌నాల వినియోగాన్ని త‌గ్గించ‌డానికి స‌రి బేసి విధానాల‌ను ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్నా ఆశించిన ప్ర‌యోజ‌నం మాత్రం రావ‌డం లేదంట‌. ఇటీవ‌ల దీపావ‌లి పండుగ తర్వాత ఢిల్లీలో మ‌రింత వాయు కాలుష్యం పెరిగింద‌ని వాతావ‌ర‌ణ నివేదిక‌లు తెలియ‌జేస్తున్నాయి. ఢిల్లీలో ఎక్కడ చూసినా పొల్యూషన్‌తో నిండిన గాలి కనిపిస్తోంది.

- Advertisement -

ఈ గాలిని పీల్చుకొని జనాలు ఊరితిత్తుల వ్యాధుల భారిన పడుతున్నారు. శ్వాస సంబంధమైన ఇబ్బందులు పడుతున్నారు. వాయు కాలుష్యాన్ని అరిక‌ట్టడం అన్న‌ది ఢిల్లీ ప్ర‌భుత్వానికి పెద్ద స‌వాలుగా మారింది. ఏం చేయాలో తెలియ‌క ఢిల్లీ ప్ర‌భుత్వ పెద్ద‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.  అయితే ఢిల్లీకి చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల్లో పంట వ్యర్థాల‌ను కాల్చడం వల్ల‌ విష వాయువులతో ఢిల్లీ మొత్తం నిండిపోతోంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.  త్వ‌ర‌లో దీనికి శాశ్వ‌త ప‌రిష్కారం క‌నుక్కోపోతే ఢిల్లీ వాసుల‌కు ఇబ్బందుల‌ను ప‌క్క‌న పెడితే దేశ ప్ర‌తిష్ఠ‌కే పెద్ద దెబ్బ కానుంద‌ని ప్ర‌జ‌లు పేర్కొంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.