News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ టికెట్స్ ..!

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మ‌రింత దూకుడు పెంచారు. డిల్లీ ప్ర‌జ‌ల‌పైవ‌రాలు కురిపిస్తున్నారు. ఇప్ప‌డికే ఢిల్లీలో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. నగరవాసులకు ప్రతి నెలా 15 జీబీ డేటాను అందిస్తామని.. అందుకోసం నగర వ్యాప్తంగా 11 వేల హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించిన కేజ్రీవాల్.. మరో 4 నాలుగు నెలల్లో ఈ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్ర‌క‌టించిన డిల్లీ సీఎం.. ఇప్పుడు మ‌హిళ‌ల‌కు మ‌రో వరాన్ని ప్ర‌క‌టించారు. డిల్లీలో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. గురువారం (ఆగస్టు 29, 2019)వ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు డిల్లీ సిఎం.

ఈ ఉచిత ప్ర‌యాణం.. అక్టోబర్ 29 వ నుండి అమ‌లు కానుంది. ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (డీటీసీ) బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లాట్ తెలిపారు. డీటీసీతోపాటు క్లస్టర్ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని.. ఉచిత పాసులు బస్సు కండక్టర్ దగ్గర అందుబాటులో ఉంటాయని తెలిపింది ప్ర‌భుత్వం. ఒక వేళ ఉచితంగా ప్రయాణించడం ఇష్టం లేని మహిళలు టికెట్ కూడా తీసుకొచ్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు గానూ కేజ్రీవాల్ రూ.140 కోట్ల నిధులను కేటాయించారు. మొన్న‌టి రక్షాబంధన్ పండుగ రోజున మహిళలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్ర‌క‌టించిన విదంగా.. ఈ ప్రత్యేక కానుక అందిస్తున్న‌ట్లు ఢిల్లీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

- Advertisement -

Tags: RTC BUS TICKETS,NEW DELHI RTC, DELHI GOVERNMENT,RTC BUS TICKETS FREE ,LADIES,RTC RESERVATIONS

Leave A Reply

Your email address will not be published.