News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం పెద్ద ముప్పును ఎదుర్కొంటోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. బీజేపీకి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టి అందలమెక్కించడంతో ఆ తీర్పును ప్రధాని మోదీ నాయకత్వం  దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఏఐసిసి కార్యాలయంలో సీనియర్‌ నేతలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఇన్‌చార్జ్‌ల విస్తృత సమావేశంలో సోనియా గాంధీ కీలకోపన్యాసం చేశారు. మూడు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో వ్యూహరచన, పార్టీ పునర్నిర్మాణంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. దేశంలో రోజు రోజుకు తిరోగమిస్తున్న ఆర్థిక పరిస్థితిపై దేశ వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని సోనియా గాంధీ పిలునిచ్చారు. కాంగ్రెస్‌ నేతలను అక్రమ కేసుల్లో ఇరికించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బీజేపీ సర్కార్ ధమననీతిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్ధేశం చేశారు.
sonia

మరో వైపు కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకోగలదా లేదా అని బీజేపీ పరీక్షిస్తోందన్న సోనియా.. మన సంకల్పానికిది పరీక్షా సమయమని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మళ్లీ ఆందోళన పథంలోకి మారాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు. సోషల్‌ మీడియా ద్వారా మాత్రమే విమర్శలు గుప్పిస్తే సరిపోదన్న సోనియా గాంధీ.. ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి, మోదీ సర్కారు తప్పిదాలను ఎండగట్టాలని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్భయంగా అడుగు ముందుకేసి.. వీధుల్లో పోరాటం చేయాలని.. గ్రామాల నుంచి నగరాల వరకు ప్రజా పోరాటాలు సాగించాలని దిశానిర్ధేశం చేశారు. ఇక ఇంటింటికీ తిరిగి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోనియా గాందీ ఆదేశించారు.

- Advertisement -

Tags: sonia, sonia gandhi, sonia gandhi fire on pm modi, sonia gandhi fire on bjp, sonia gandhi fire on modi govt, sonia gandhi comments on pm modi

Leave A Reply

Your email address will not be published.