బీడబ్లూఎఫ్ టైటిల్ ను గెలిచిన సింధు

news02 Dec. 16, 2018, 12:58 p.m. sports

pv sindhu

తెలుగు తేజం.. భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో రెండో సీడ్‌ జపాన్ కు చెందిన ఒకుహర పై సింధు అద్భుత పోరాటంతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 21-19, 21-17 తేడాతో వరుస సెట్లలో గెలిచి ప్రత్యర్థి ఒకుహరను మట్టికరిపించింది. గత యేడాది ఫైనల్లో ఓడిన పీవీ సింధు.. ఈ సారి టైటిల్‌ గెలిచి గత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఏడాది సింగిల్స్‌లో సింధు ఖాతాలో తొలి టైటిల్‌ ఇదే కావడం విశేషం. ఇక పీవి సింధు కు దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రలు చంద్రబాబు, కేసీఆర్, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సింధుకు కు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

tags: pv sindhu, pv sindhu won bwf title, sindhu won bwf title, pv sindhu win bwf title

Related Post