సన్ రైజర్స్ ఆటగాళ్లతో సరదాగా

news03 March 20, 2019, 3:12 p.m. sports

suma

ప్రముఖ టీవీ యాంకర్‌ సుమతో కలిసి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సభ్యులు డేవిడ్‌ వార్నర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ సందడి చేశారు. ఓ వాణిజ్య ప్రకటన యాడ్‌ షూటింగ్ లో భాగంగా సన్‌రైజర్స్‌ జట్టు సభ్యులతో కలిసి సుమ సందడిగా గడిపింది. ఈ నేపధ్యంలో తీసిన ఫొటోలను సుమ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భువనేశ్వర్‌, డేవిడ్‌ వార్నర్‌ తో సుమ కలిసి దిగిన ఫొటోలను అభిమానులు బాగా లైక్‌ చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న 12వ ఐపీఎల్‌ సీజన్‌కు అంతా సన్నద్ధమౌతున్నారు. ఐతే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీం మేంబర్స్ ప్రాక్టీస్‌ తర్వాత ఖాళీ సమయంలో యాడ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 

tags: suma, anchor suma, suma with sunrisers, suma with sunrisers players, suma with sunrisers cricket players

Related Post