News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

పెద్ద శబ్దం చేస్తూ అమీర్ పేట్ లో నిలిచిపోయిన మెట్రో రైలు!

  • ‘మెట్రో’లో తలెత్తిన సాంకేతిక సమస్య
  • విద్యుత్ సరఫరాలో లోపంతో తలెత్తిన సమస్య  
  • బేగంపేట్-అమీర్ పేట్ స్టేషన్ల మధ్య విద్యుత్ లైన్ లో సాంకేతిక సమస్య

హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అమీర్ పేట్ స్టేషన్ సమీపంలో పెద్ద శబ్దం చేస్తూ ఒక్కసారిగా మెట్రో రైలు ఆగిపోయింది. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ, విద్యుత్ సరఫరాలో లోపం వల్లే రైలు నిలిచిపోయిందని చెప్పారు. బేగంపేట్-అమీర్ పేట్ స్టేషన్ల మధ్య విద్యుత్ లైన్ లో సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని అన్నారు.

- Advertisement -

మెట్రో సేవలకు అంతరాయం కలిగిందని, సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నటు తెలిపారు. ఈ ఘటనతో అమీర్ పేట్- హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Leave A Reply

Your email address will not be published.