News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రివర్స్ టెండరింగ్ కుదరదని ఝలక్ ..!

విజయవాడ : పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు రివర్స్‌ టెండరింగ్ విషయంలో జగన్‌ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కాంట్రాక్టును రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ నవయుగ చేపడుతున్న జలవిద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ ఏపీ జెన్కో జారీ చేసిన ఉత్తర్వులను కోర్ట్ సస్పెండ్‌ చేసింది. అదే విధంగా ఈ వ్యవహారంలో రివర్స్‌ టెండర్‌ ప్రక్రియలో ముందుకు వెళ్లరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని .. ఏపీ జెన్కోను ఆదేశించింది. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

Jagan

- Advertisement -

నవయుగ సరిగ్గా పనులు చేయడం లేదన్న ఏజీ వాదనను హైకోర్టు తిరస్కరించింది. ఒప్పంద ఉల్లంఘన జరిగితే కాంట్రాక్టర్‌ తో చర్చించడం .. సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వడం వంటివి జరిగినట్లు లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఒప్పందంలో ఒక పద్ధతిని నిర్దేశించిన తరువాత .. దానిని రద్దు చేయడంగానీ .. ఇతర ప్రత్యామ్నాయాలవైపు చూడడంగానీ సరికాదని స్పష్టం చేసింది. నవయుగకు, ఏపీ జెన్కోతో ఒప్పందం కుదిరింది .. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్రాలేదు. ఏపీ జెన్కో రాష్ట్రంలోని ఒక డిపార్ట్‌మెంట్‌ అయినప్పటికీ ఒకసారి ప్రైవేటు పార్టీతో ఒప్పందం కుదిరాక అదే చెల్లుబాటు అవుతుంది. అందువల్ల ఈ కాంట్రాక్టును సమీక్షించేందుకు గానీ .. ఒప్పందాన్ని రద్దు చేయాలని సూచించేందుకు గానీ .. రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టడానికి గానీ ప్రభుత్వాని కి ఎలాంటి హక్కూ లేదని హైకోర్టు కుండబద్దలు కొట్టింది.

Jagan

Leave A Reply

Your email address will not be published.