News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అసలు తిరుమలలో ఏం జరుగుతోంది ..!

తిరుప‌తి : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. తిరుపతికి వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ఇచ్చే టికెట్లపై ఒక యాడ్ తీవ్ర వివాదం రేపుతోంది. ఈ టికెట్ల వెనుక భాగంలో ఉన్న అన్యమతానికి చెందిన యాడ్ రచ్చకు కారణమయింది. తిరుమలలో హజ్ .. జెరూసలేం యాత్రా ప్రకటనలు దర్శనమివ్వడంతో బీజేపీ .. హిందూ సంఘాలు మరోసారి జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. పాలకులు హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ మండిపడుతున్నారు. తిరుమల కొండపైకి వెళ్ళే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ముస్లింల హజ్ యాత్ర .. క్రిస్టియన్ల జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ కనిపించాయి. ఆ ఫొటోలను కొందరు భక్తులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయింది.

Thirumala

- Advertisement -

తిరుమలలో అన్యమతాల ప్రచారంపై నిషేధం ఉన్నా.. ప్ర‌భుత్వంలోని కొంద‌రు ముఖ్యుల‌ ప్రోత్సాహంతోనే ఇలా హజ్ .. జరూసలేం యాత్రలకు సంబంధించిన యాడ్స్ .. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ లో ఇలాంటి ప్రచారానికి అనుమతి ఇస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అన్యమత మార్పిడిలు పెద్ద ఎత్తున జరుగుతున్న .. కొద్ది రోజుల క్రితం విజయవాడ లో దాదాపు 100 గోవులు అనుమానస్పద మృత్యువాత పడ్డా వాస్తవాలు వెలుగులోకి రాక‌పోవ‌డానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్య‌మేంటో అర్థ‌మౌతుంద‌నే విమ‌ర్శ‌లు హిందూ ధార్మిక సంఘాల నుంచి ఎదురౌతుంది.

Thirumala

Leave A Reply

Your email address will not be published.