News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రాజ్య సభ ఆమోదం పొందిన ట్రిపుల్ తలాఖ్

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు ఎట్టకేలకు రాజ్యసభ ఆమోదం లభించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్రిపుల్ తలాఖ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా..  నాలుగు గంటల పాటు సభలో అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ అనంతరం ఓటింగ్‌ జరిగింది. బిల్లుకు అనుకూలంగా మొత్తం 99, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. సభ్యుల ఓట్ల లెక్కింపు అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు ముందు మోజువాణి ఓటుతో ఆమోదం తెలపగా.. విపక్షాలు డివిజన్‌ కోరడంతో ఆ తరువాత ఓటింగ్‌ నిర్వహించారు. ఈ ఓటింగ్‌కు వైసీపీ, టీడీపీ, టీఆర్ ఎస్, అన్నాడీఎంకే, డీఎంకే, జేడీయూ పార్టీలు దూరంగా ఉండగా.. బీఎస్పీ సభ నుంచి వాకౌట్‌ చేసింది. ఎన్సీపీకి చెందిన శరద్‌ పవార్‌, ప్రఫుల్‌పటేల్‌, నలుగురు కాంగ్రెస్‌ సభ్యులు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత ట్రిపుల్ తలాఖ్ బిల్లు చట్టం కానుంది.

- Advertisement -

Tags: triple talaq, triple talaq bill, triple talaq bill passed, triple talaq bill passed in rajyasabha, triple talaq bill passed in parliament, triple talaq bill passed in loksabha

Leave A Reply

Your email address will not be published.