News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇవ్వడం చారిత్రక తప్పిదం: దాసోజ్ శ్రవణ్ కుమార్

  • హుజూర్ నగర్ ఉపఎన్నికపై స్పందించిన శ్రవణ్
  • టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇవ్వడం కరెక్టు కాదు
  • సీపీఐలో కూడా డొల్లతనం వచ్చిందేమో

త్వరలో జరగనున్న హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇవ్వడం కొంత తప్పుడు నిర్ణయం అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కమ్యూనిస్టులు అంటే  సమాజంలో ఎక్కడ చిన్న తప్పు జరిగినా పెద్ద ఎత్తున పోరాడే వాళ్లు, కార్మికులకు అండగా నిలిచే వాళ్లు, అటువంటి వాళ్లు టీఎస్సార్టీసీ ఉద్యోగులను తీసేస్తున్నామన్న అధికార టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం దారుణమని అన్నారు.

- Advertisement -

ఈ విషయమై ఆలోచిస్తే సీపీఐలో కూడా డొల్లతనం వచ్చిందేమోనని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇవ్వడం చారిత్రక తప్పిదంగా అభివర్ణించారు.

Leave A Reply

Your email address will not be published.