News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఉద్యమకారులకు టిఆర్ఎస్ లో విలువ లేదు.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

టీఆర్ఎస్‌లో విబేధాలు మరోసారి బయటికి భగ్గుమన్నాయి. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌పై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులంటూ ఎవరూ చెప్పుకు తిరగవద్దని, జీవితం మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. అసెంబ్లీ లాబీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

టీఆర్ఎస్‌ పార్టీలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని కొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకంటే సొంత పార్టీ నేతలు తెలిపే అసంతృప్తే ఎక్కువగా ఉంది. ఇప్పుడు పార్టీ సీనియర్ నేత పద్మారావు కూడా పార్టీలో ఉద్యమకారులకు అన్యాయం జరగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

‘‘ఉద్యమకారులమంటూ చెప్పుకుని తిరగకండి. జీవితం మీద దృష్టి పెట్టండి’’ అని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌కు సూచించారు. అదే సమయంలో అటుగా వస్తున్న ఈటలను చూపిస్తూ ‘‘ఉద్యమకారులకు ఏం జరుగుతుందో వీళ్లకు అర్థంకావడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ మాటలు విన్న ఈటల.. ఏమీ మాట్లాడకుండా పద్మారావుకు నమస్కారం పెట్టి వెళ్లారు. కాగా, గట్టిగా మాట్లాడుతున్న పద్మారావును ఎమ్మెల్యే బాల్క సుమన్ సముదాయించారు.

Tags: Trs owners, etala rajender, Padmarao goud, ghmc elections, ghmc mayor, telangana assembly, cm kcr, telangana political parties, minister ktr family.

Leave A Reply

Your email address will not be published.