News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఆర్టీసీ కండక్టర్ రాజీనామా లేఖ.. షాక్‌లో సీఎం కేసీఆర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కి ఆర్టీసీ కండక్టర్ నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం దాదాపు 50 రోజులకు పైగా చేపట్టిన సమ్మెను విరమించి విధులలో చేరడానికి వస్తే వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే ప్రభుత్వ వైఖరిపై అసహనం చెందిన ఆర్టీసీ కండక్టర్ తాజాగా సీఎం కేసీఆర్‌కు తానే స్వయంగా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరిని కంటతడి పెట్టిస్తుంది. అయితే సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ లూనావత్ కృష్ణ సీఎం కేసీఆర్‌కి రాసిన తన లేఖలో తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేద్దామని అనుకున్నానని, మీలాంటి గొప్ప మనిషి సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బ్రతకలేమని ఇప్పటికి తెలుసుకున్నామని అన్నారు. మీరు ఇచ్చిన మాట తప్పడం, మాయ మాటలు చెప్పి మోసం చేయడం మా కార్మికులంతా చాలా లేట్‌గా తెలుసుకున్నామని, ఆనాడు ఆంధ్ర పాలకులు మనల్ని మోసం చేస్తున్నారంటే మీ మాటలని నమ్మి మీ వెంట నడిచామని 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వచ్చిందని తెలంగాణ వచ్చింది ప్రజల కోసం కాదు మీలాంటి నాయకుల కోసమే అని ఇప్పుడు అర్ధమయ్యిందని రాశారు.

- Advertisement -

ఎందరో చచ్చి సాధించిన తెలంగాణలో నియంతృత్వం చూస్తా అని అనుకోలేదని, 30 మంది కార్మికులు చనిపోతే కూడా మీరు కనీసం స్పందించకపోవడం దారుణమని, నా అక్కా చెళ్ళెల్లు లాఠీ దెబ్బలు తింటారని కలలో కూడా ఊహించలేదని అన్నారు. నా ఆర్టీసీ అక్క చెల్లెళ్ల ఉసురు కచ్చితంగా మీకు తగులుతుందని అందుకే ఇవన్నీ భరించలేకనే నా ఆత్మభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేను. అందుకే నేను మీ బంగారు తెలంగాణలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు. మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజం లోని వ్యక్తిని అంటూ మీలాంటి ఒక మోసకారి, ఒక మాటకారి, ఒక మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మభిమనాన్ని చంపుకొని ఉద్యోగిగా పని చేయలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా. నా పేరు ఎల్.కృష్ణ. నా స్టాఫ్ నెంబర్ 176822. సూర్యాపేట డిపో సార్. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. మీ సంస్థ నుంచి నాకు రావాలిసిన బకాయిలను ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా యొక్క మనవి.

 

Leave A Reply

Your email address will not be published.