News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

హౌ డేర్ యూ.. అంటు ఉత్త‌మ్ ఫైర్

  • హైకోర్ట్ ఎన్ని సార్లు చీవాట్లు పెట్టినా బుద్దిరాదా..?
  • ప్ర‌తిప‌క్షాలు కుట్ర చేశాయా ?… ద‌మ్ముంటే అరెస్ట్ చేయ్..!
  • కేసీఆర్ ..తెలంగాన నీ జాగీర్ కాదు..

హైకోర్ట్ లో ఆర్టీసీ స‌మ్మేపై ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స‌మ‌ర్పించిన అఫిడ‌వుట్ పై నిప్పులు చెరిగారు పీసీసీ ఛీఫ్, న‌ల్గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. ఆర్టీసీ కార్మికులు , విప‌క్షాల‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని కూల్చే కుట్ర ప‌న్నార‌ని.. ఎండి అఫిడ‌వుట్ లో పేర్కొన‌డాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. న్యాయమైన డిమాండ్ ల‌కోసం పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికుల‌కు ప్ర‌తిప‌క్ష పార్టీలు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం.. రాజ‌ద్రోహ‌మా.. ? అంటు ప్ర‌శ్నించిన ఉత్త‌మ్.. నిజంగా కుట్ర చేసిన‌ట్టు ఆదారాలుంటే.. బ‌య‌ట‌పెట్టి ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను అరెస్ట్ చేయాల‌ని.. .. లేదంటే… కోర్ట్ కు త‌ప్పుడు అఫిడ‌వుట్ ను దాఖ‌లు చేసిన సునీల్ శ‌ర్మ‌ను త‌క్ష‌ణ‌మే డిస్మిస్ చేయాల‌ని డిమాండ్ చేశారు ఉత్త‌మ్.

ఆర్టీసీ స‌మ్మెపై లెక్క‌లు చెప్ప‌కుండా.. హైకోర్ట్ కు త‌ప్పుడు స‌మాచారాన్ని ఇవ్వ‌డం అధికారుల‌కు అల‌వాటైంద‌ని అన్నారు ఉత్త‌మ్. ఇదే విష‌యంపై న్యామూర్తులు…ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా ప్ర‌భుత్వానికి , అధికారులకు బుద్దిరావ‌డం లేద‌న్న ఆయ‌న‌.. ఇప్పుడు ఏకంగా ప్ర‌తిప‌క్షాల‌పై కుట్ర ఆరోప‌ణ‌లు చేయ‌డంను హైకోర్ట్ సుమోటోగా తీసుకుని స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించాల‌ని విజ్ఙ‌ప్తి చేశారు. కుట్ర‌చేసే నైజం కాంగ్రెస్ ది కాద‌న్న ఉత్త‌మ్.. రాజ్యాంగబధ్దంగానే పోరాడుతామ‌న్నారు.

- Advertisement -

PM Modi Vs Sonia Gandhi In Lok Sabha

సునీల్ శర్మపై డివోపిటికి ఫిర్యాదు చేస్తామన్న ఉత్త‌మ్.. ఆర్టీసీ కార్మికుల సమస్యను పార్లమెంట్ లో లేవ నెత్తుతామ‌ని అన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీని నిర్వీర్యం చేసి.. ప్రైవేట్ ప‌రంచేయాల‌ని కేసీఆర్ చూస్తున్నార‌ని.. ఆర్టీసీ ఉధ్యోగుల‌కు డెడ్ లైన్లు పెట్టి భ‌య భ్రాంతుల‌కు గురిచేస్తున్నార‌ని మండిప‌డ్డ ఉత్త‌మ్.. తెలంగాణ నీ..జాగీరు కాద‌ని కేసీర్ కు హెచ్చ‌రించారు. 24 మంది ఆర్ట‌సీ కార్మికులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నా.. కేసీఆర్ క‌ళ్ళ‌కు క‌న‌బ‌డ‌టంలేద‌ని .. దీనికోస‌మేనా.. తెలంగాణ తెచ్చుకుంది అని నిల‌దీశారు. ఇప్ప‌డికైనా.. ఆర్టీసీ సమ్మె పై చర్చించడానికి సీఎం కేసీఆర్ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. నవంబర్ 19న ఆర్టీసీ జేఏసీ త‌లపెట్టిన సడక్ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ్వాలని ఆయన కోరారు.

80%
Awesome
  • Design

Leave A Reply

Your email address will not be published.