News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రమే ప్రత్యమ్నాయం ..!

తెలంగాణలో బీజేపీ బలపడుతుందనేది కేవలం గోబెల్స్ ప్రచారమే అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాబోయే రోజుల్లో కూడా ఆ పార్టీకి ఎలాంటి విజయావకాశాలు ఉండవన్నారు ఉత్తమ్. హిందువులను .. ముస్లింలను విభజించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు.ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శులు .. పీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీలో చేరే వారు పెద్దగా లేకపోయినా ప్రచార ఆర్భాటం ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని .. అయినా మతం ఆధారంగా తెలంగాణలో ఎదుగుతామని బీజేపీ నేతలు అనుకోవడం వారి భ్రమేనని అన్నారు.

Uttam kumar reddy

మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదన్నారు పీసీసీ చీఫ్. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్‌ఎస్ ను ఓడించే సత్తా కాంగ్రెస్ కే ఉందన్నారు. రాష్ట్ర, మండల స్థాయిలో పోరాటానికి పార్టీని సన్నద్ధం చేస్తున్నామన్నారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడి మార్పు అసలు ఏఐసీసీ పరిశీలనలోనే లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా స్పష్టం చేశారు. పిసిసి మార్పు అంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. పార్టీ నాయకులమంతా .. మునిసిపల్‌ ఎన్నికలు .. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక .. పార్టీ సభ్యత్వ నమోదు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించామని చెప్పారు.

- Advertisement -

Uttam kumar reddy

Tags: UTTAM KUMAR REDDY,TPCC CHEAF, GANDHIBHAVAN,AICC STEATE INCHARGE KUNTIYA, SONIA GANDHI, RAHUL GANDHI, PRIYANKA GANDHI,AICC MEETINGS,BJP, NARENDRA MODI, AMITH SHA,BJP NATIONAL PRESENT, TELANGANA BJP,KCR

Leave A Reply

Your email address will not be published.