News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

తెలుగు తెరకి మరో కొత్త కథానాయికగా ‘కృతి శెట్టి’

ముగింపు దశలో ‘ఉప్పెన’
దర్శకుడిగా బుచ్చిబాబు పరిచయం
ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి

తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతున్నారు. అందం .. అభినయంతో పాటు అదృష్టం కలిసొచ్చిన వాళ్లు అవకాశాలను అందుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఉప్పెన’ చిత్రం ద్వారా తెలుగు తెరకి ‘కృతి శెట్టి’ పరిచయం అవుతోంది.

- Advertisement -

చక్కని కనుముక్కుతీరుతో కట్టిపడేస్తున్న ఈ అమ్మాయి, ‘ఉప్పెన’ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ కొడితే యువ కథానాయకుల జోడీగా ఆమె జోరు కొనసాగడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేసే ఆలోచనలో వున్నారు.
Tags: Vaishnav Tej, Krithi Shetty, uppena movie

Leave A Reply

Your email address will not be published.