News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

దేవ‌ర‌కొండ మీద ఇంత క‌సేంటి బాబోయ్

సోష‌ల్ మీడియా రెండు వైపులా ప‌దునున్న క‌త్తి. స‌క్సెస్ సాధించిన స‌మ‌యంలో అక్క‌డ పొగ‌డ్త‌లు ఏ స్థాయిలో ఉంటాయో.. ఫెయిల్యూర్ అయిన‌పుడు తెగ‌డ్త‌లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. పూలు చ‌ల్లిన‌ వాళ్లే రాళ్లు కూడా వేస్తార‌న్న సంగ‌తి మ‌రిచిపోకూడ‌దు. పాజిటివ్ రెస్పాన్స్ చూసి, ఫాలోయింగ్ చూసి అతి చేయ‌డం మొద‌లుపెడితే.. స‌మ‌యం చూసి రివ‌ర్స్ పంచులు ఇస్తారు నెటిజ‌న్లు. విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యంలో ఇదే జ‌రుగుతోంది. అర్జున్ రెడ్డి సినిమాతో వ‌చ్చిన పాపులారిటీని ఉప‌యోగించుకుని ఒక ద‌శ‌లో సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయాడు విజ‌య్. గీత గోవిందం టైంలో అత‌డి క్రేజ్ ప‌తాక స్థాయికి చేరుకుంది. సోష‌ల్ మీడియాలో అత‌నేం చేసినా వ‌ర్క‌వుటైంది. అన్నీ మంచి ఫ‌లితాలే ఇచ్చాయి.

ఐతే కొన్ని సంద‌ర్భాల్లో విజ‌య్ కొంచెం హ‌ద్దులు దాటి మాట్లాడ‌టం, ప్ర‌వ‌ర్తించ‌డ‌మూ సోష‌ల్ మీడియా జ‌నాల‌కు అనుభ‌వ‌మే. ఇది న‌చ్చ‌ని వాళ్లంతా విజ‌య్ ఫెయిల్యూర్ కోసం ఎదురు చూశారు. డియ‌ర్ కామ్రేడ్‌కు డివైడ్ టాక్ వ‌చ్చేస‌రికి అత‌డి మీద ప‌డిపోయారు. ఓ రేంజిలో ట్రోల్ చేశారు. ఆ త‌ర్వాత కూడా వేరే సంద‌ర్భాల్లో విజ‌య్‌ను సోష‌ల్ మీడియా జ‌నాలు ఆడుకుంటుండ‌టం విదిత‌మే.

- Advertisement -

ముఖ్యంగా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ ఫ‌స్ట్ లుక్ రిలీజైన‌ప్ప‌టి నుంచి దాని ప్ర‌తి ప్రోమో విష‌యంలో నెటిజ‌న్లు నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. విజ‌య్ అర్జున్ రెడ్డి హ్యాంగోవ‌ర్ నుంచి బ‌య‌టికి రాలేక‌పోతుండ‌టాన్ని ఎత్తి చూపిస్తూ అత‌ణ్ని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా రిలీజైన టీజ‌ర్ చూశాక యాంటీ ఫ్యాన్స్ మ‌రింత రెచ్చిపోయారు. దీని మీద ఓ రేంజిలో ట్రోల్స్, మీమ్స్ ప‌డుతున్నాయి. విజ‌య్ ఒక మూస‌లో ప‌డిపోతున్న విష‌యాన్ని ఎత్తి చూపుతూ.. అత‌డి మీద జోకులు పేలుస్తున్నారు. ఇవ‌న్నీ చూస్తే విజ‌య్ మీద నెటిజ‌న్లు ఇంత‌లా ప‌గ‌బ‌ట్టేశారేంట‌బ్బా అనిపిస్తోంది.
TAGS: Vijay Devarakonda, world famous lover, Teaser Trolls

Leave A Reply

Your email address will not be published.