News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఈనెల 21 వరకు ప్రయత్నిస్తాం-ఇస్రో

చంద్రుడు దక్షిణ దృవంపై ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు అమెరికాలోని నాసా రంగంలోకి దిగింది. విక్రమ్‌ నుంచి స్పందన కోసం నాసా తన డీప్‌స్పేస్‌ నెట్‌వర్క్‌ సెంటర్ల ద్వారా, జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్‌ ద్వారా రేడి యో సంకేతాలు పంపుతోంది. మరోవైపు ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో ఉన్న నాసా లూనార్‌ ఆర్బిటర్‌ ఈ నెల 17న విక్రమమ్ ల్యాండర్‌ ఉన్న దిశ వైపునకు వస్తోంది. ఆ సమయంలో అది విక్రమ్ ఫొటోలు తీస్తుందని నాసా శాస్త్రజ్ఞులు తెలిపారు. తమ ఆర్బిటర్ తీసిన ఫోటోలను ఇస్రోతో పంచుకుంటామని నాసా అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు మన ఇస్రో కూడా విక్రమ్‌ ల్యాండర్ తో సంబంధాల పునరుద్ధరణ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈమేరకు బెంగళూరు సమీపంలోని బైలాలు డీప్‌స్పేస్‌ నెట్‌వర్క్‌ నుంచి సంకేతాలు పంపుతోంది. ఈ నెల 21 వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని ఇస్రో స్పష్టం చేసింది.

- Advertisement -

Tags: vikram, vikram lander, nasa, america nasa, nasa trying to reach vikram lander, nasa trying to communicate vikram lander

Leave A Reply

Your email address will not be published.