Stalin JAiler

రజనీ జైలర్‌ మూవీని వీక్షించిన ముఖ్యమంత్రి

మూవీ రిపోర్ట్- సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తాజా సినిమా జైలర్‌ (Jailer) ఈనెల 10న విడుదల కాగా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. తమిళ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (CM Stalin) సైతం జైలర్ మూవీని వీక్షించారు. సినిమా చూసిన తరువాత ముఖ్యమంత్రి దర్శకుడితో మాట్లాడారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ నెల్సన్‌ ట్వీట్‌ చేశారు. జైలర్‌ సినిమాను వీక్షించిన సీఎం స్టాలిన్‌ సర్‌ కు ధన్యవాదాలు.. మీ ప్రశంసలు నాలో స్ఫూర్తి నింపాయి.. చిత్ర బృందం మొత్తం ఎంతో ఆనందంగా ఉంది.. అని ట్వీట్ లో పేర్కొన్నారు.

జైలర్ మూవీ సక్సెస్ పట్ల మోహన్‌ లాల్‌ (Mohanlal) , శివరాజ్‌కుమార్‌ (Shivarajkumar) సంతోషం వ్యక్తం చేశారు. జైలర్ పై ప్రేక్షకులు చూపిస్తోన్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. మాఫియా, ప్ర‌తీకార నేప‌థ్యం, కుటుంబ అంశాల మేళ‌వింపుగా రూపొందిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి క‌థ జైలర్ సినిమా. ముత్తు అలియాస్ ముత్తువేల్ పాండ్య‌న్ (ర‌జ‌నీకాంత్‌) అనే రిటైర్డ్ పోలీస్ అధికారి పాత్రలో రజనీ కాంత్ తనదైన స్టైల్లో చాలా సింపుల్ గా నటించి మెప్పించారు. రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి రమ్యకృష్ణ నటించగా, మోహన్‌ లాల్‌, జాకీష్రాఫ్‌, శివరాజ్‌కుమార్‌ ముఖ్య పాత్రల్లో కనిపించారు.


Comment As:

Comment (0)