Pragyan

చంద్రయాన్‌-3 ప్రయోగంలో మరో కీలక ఘట్టం

చంద్రుడికి మరింత దగ్గరగా చంద్రయాన్-3

నేషనల్ రిపోర్ట్- చందమామ గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు, పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగంలో తాజాగా మరో కీలక ఘట్టం సక్సెస్ ఫుల్ అయ్యింది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విడిపోయి చంద్రుడి కక్ష్యలో సొంతంగా పరిభ్రమిస్తున్న విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander) వేగాన్ని తగ్గించే డీబూస్టింగ్ ప్రక్రియను శుక్రవారం సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకుంది. ఈ ప్రక్రియతో దాని కక్ష్య 113×157 కిలో మీటర్లకు తగ్గడంతో చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువైనట్లయింది. రెండో డీబూస్టింగ్‌ ప్రక్రియను ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు చేపట్టనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు.

ప్రస్తుతం విక్రమ్‌, అందులోని రోవర్ ప్రగ్యాన్‌ (Pragyan Rover) ఆరోగ్యంగానే ఉన్నాయని తెలిపారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండర్‌ దిగనుంది. ఇక చంద్రయాన్-3 విక్రమ్‌ ల్యాండర్‌ తీసిన చంద్రుడి ఫొటోలను సోషల్ మీడియా ఎక్స్‌ (Twitter) లో పోస్ట్ చేసింది ఇస్ర. ఆ ఫోటోల్లో చందమామ ఉపరితలంపై బిలాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆ బిలాల్లో ఫ్యాబ్రీ, గియార్డనో బ్రూనో, హర్కేబి జే ఉన్నాయని ఇస్రో తెలిపింది.


Comment As:

Comment (0)