Chiranjeevi Trisha

త్రిషపై మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలను ఖండించిన మెగాస్టార్

త్రిషకు మద్దతు ప్రకటించిన చిరంజీవి 

మూవీ రిపోర్ట్- మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినీ నటి త్రిష (Trisha) కు మద్దతుగా నిలిచారు.తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor Ali Khan) త్రిషపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నటి రోజా, రాధిక, గాయని చిన్మయి,లోకేశ్‌ కనగరాజ్‌ ఇలా తమిళ, తెలుగు పరిశ్రమకు చెందిన ప్రముఖులు త్రిషపై  మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే త్రిషకు మద్దతుగా చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

 చిరంజీవి ఏమన్నారంటే.. త్రిష పై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి.. ఒక నటిని మాత్రమే కాదు.. ఏ స్త్రీని ఇలా అనకూడదు.. చాలా అసహ్యంగా ఉన్నాయి.. వీటిని తీవ్రంగా ఖండించాలి.. వక్రబుద్ధితో ఇలా మాట్లాడుతున్నారు.. త్రిషకు మాత్రమే కాదు.. ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయి ఎదుర్కొన్నా.. నేను అండగా ఉంటాను.. అని చిరంజీవి పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని.. లియో సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నట్లు చెప్పారు. ఆ సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించిందని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై  త్రిష ఆగ్రహం వ్యక్తం చేయగా, చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐతే తన వ్యాఖ్యలను తప్పుగా  అర్ధం చేసుకున్నారని మన్సూర్‌ అలీఖాన్‌ వివరణ ఇచ్చారు.


Comment As:

Comment (0)