Komatireddy Venkat Reddy

రోడ్లు భవనాల శాఖల మంత్రిగా కోమటిరెడ్డి పదవీ బాధ్యతలు

పదేళ్లలో మీరేం చేశారని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్‌ రిపోర్ట్- రోడ్లు, భవనాలల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy)  పదవీభాద్యతలు స్వీకరించారు. సచివాలంలోని తన ఛాంబర్ లో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మొత్తం 9 ఫైల్స్ పై సంతకాలు చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గత పది సంవత్సరాలుగా రహదారులపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ పెట్టలేదని మంత్రి ఆరోపించారు. కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని.. త్వరలో కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణం చేపడుతామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పాత భవనం ఆవరణలోనే ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. సీఎల్‌పీ కార్యాలయాలు కూల్చి కొత్త భవనాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఏం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు మాట్లాడుతున్నారని.. పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు ఏం చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. గత పదేళ్లుగా రోడ్ల అభివృద్దిపై శ్రద్ధ పెట్టలేదని.. తాము ఎవరి మీద కావాలని కక్ష సాధించబోమని, తప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.


Comment As:

Comment (0)